Site icon NTV Telugu

Building Collapsed : పండగ పూట విషాదం.. విశాఖలో కూలిన కుప్పకూలిన భవనం

Rr

Rr

Building Collapsed : కొత్త సంవత్సరం విశాఖపట్నంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. కలెక్టరేట్‌ సమీపంలోని రామజోగి పేటలో మూడంతస్తుల భవనం కుప్పకూలింది. ఈ ఘటనలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులందరినీ కేజీహెచ్ ఆస్పత్రికి తరలించారు. వారికి ఎమర్జెన్సీ వార్డులో అత్యవసర వైద్య చికిత్స అందిస్తున్నారు. ఈ దుర్ఘటనలో శిథిలాల కింద మరికొందరు చిక్కుకున్నట్లు సమాచారం. మరో ఆరుగురిని రక్షించి కేజీహెచ్‌ ఆస్పత్రికి తరలించారు. రెండు రోజులుగా కురిసిన వర్షాలకు పురాతన భవనం కూలినట్టు ప్రాథమిక నిర్ధారణలో తేలింది. వారికి ఎటువంటి ప్రాణాప్రాయం లేదని కేజీహెచ్ సూపరింటెండెంట్‌ అశోక్ కుమార్ తెలిపారు. వారందరికీ మెరుగైన వైద్య చికిత్స అందిస్తున్నామన్నారు. తెల్లవారుజామున 2 గంటలకు ప్రమాదం జరగడంతో తమకేమీ గుర్తులేదని గాయపడిన వారు అంటున్నారు. వారు ఇంకా ఆ షాక్ నుంచి కోలుకోలేని పరిస్థితి నెలకొంది.

Read Also: Cyber Crimes : పెరుగుతున్న సైబర్ మోసాలు.. ఇలా చేస్తే మీరు సేఫ్

సమాచారం అందుకున్న ఎన్టీఆర్ఎఫ్‌, ఫైర్ సిబ్బంది, పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. బిల్డింగ్‌ కుప్పకూలడంతో బాలిక సాకేటి అంజలి (15) అక్కడికక్కడే ప్రాణాలు వదిలింది. రామకృష్ణ మిషన్‌ స్కూల్లో పదో తరగతి చదువుతోంది అంజలి. ప్రస్తుతం ఆమె సోదరుడి కోసం గాలింపు చర్యలు చేపడుతున్నారు. శిథిలాలలో మరో యువకుడు కూడా చిక్కుకున్నట్లు తెలుస్తోంది. G+ 2 భవంతిలో రెండు కుటుంబాలతో పాటు ఇద్దరు బ్యాచిలర్స్ నివాసం ఉంటున్నట్లు గుర్తించారు. భవనం లో మొత్తం తొమ్మిది మంది ఉన్నట్టు సమాచారం. వారిలో అంజలి చనిపోగా ఆరుగురిని కేజీహెచ్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తారు. మరో ఇద్దరి కోసం రెస్క్యూ ఆపరేషన్‌ చేస్తున్నారు ఎన్టీఆర్ఎఫ్‌, ఫైర్ సిబ్బంది. కాగా నిన్న (మార్చి 23) అంజలి పుట్టిన రోజు వేడుకలు జరుపుకోవడం విశేషం. ఇంతలోనే ఈ దుర్ఘటన చేసుకుంది. దీంతో అంజలి కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరవుతున్నారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. కాగా శిథిలాల నుంచి మరొక మృత దేహం వెలికితీశారు. గ్రౌండ్ ఫ్లోర్ లో ఉన్న నూడిల్స్ షాప్ సహాయకుడు బీహార్ కు చెందిన చోటుగా గుర్తించారు.

Read Also: KA Paul Ugadi Panchangam: కేఏ పాల్ ఉగాది పంచాంగం.. అధికారంలోకి వచ్చేది ఎవరో తేల్చేశారు..!

Exit mobile version