Site icon NTV Telugu

Emergency Landing: ఫ్లైట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్.. చిక్కుకున్న 200 మంది భారతీయులు

Virgin

Virgin

Emergency Landing: లండన్ నుంచి ముంబయికి బయలుదేరిన ఒక విమానం మెడికల్ ఎమర్జెన్సీ కారణంగా టర్కీలో అత్యవసరంగా ల్యాండ్ అయింది. ఈ ఘటనతో టర్కీలోని దియార్‌బకిర్ ఎయిర్‌పోర్టులో బుధవారం రాత్రి నుంచి 200 మందికిపైగా భారతీయ ప్రయాణికులు చిక్కుకుపోయారు. వర్జిన్ అట్లాంటిక్ విమానం లండన్ నుండి ముంబయి ప్రయాణానికి బయలుదేరింది. అయితే, సాంకేతిక సమస్య కారణంగా, దియార్‌ బకిర్ ఎయిర్‌పోర్టులో ల్యాండ్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.

Read Also: Hanu- Prabhas: హనుతో ప్రభాస్ మరో సినిమా?

అయితే సమాచారం మేరకు ల్యాండింగ్ సమయంలో కొన్ని సాంకేతిక సమస్యలు చోటు చేసుకున్నట్లు సమాచారం. ఈ కారణంగా ప్రయాణికులకు విమానాశ్రయం నుండి బయటకు వెళ్లే అనుమతులు ఇవ్వలేదు. దీంతో దాదాపు 20 గంటలుగా ప్రయాణికులు అక్కడే ఉన్నారు. విమానంలో 200 మందికి పైగా భారతీయులు ఉన్నారని, వారు ఎప్పటికి ముంబయికి చేరుకుంటారో అనే విషయంలో ఇంకా స్పష్టత రాలేదు. విమానయాన సంస్థ నుండి ఈ విషయంపై ఎటువంటి అధికారిక ప్రకటన ఇంకా అందలేదు.

ప్రస్తుతానికి తగిన సౌకర్యాలు కూడా లేకుండా ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నట్లు సమాచారం. ఆ విమానాశ్రయం మిలిటరీ బేస్ ప్రాంతంలో ఉండటంతో వారు బయలుదేరడం కుదరటంలేదని సమాచారం. ఇక సంబంధిత అధికారులకు గమ్యస్థానానికి వీలైనంత త్వరగా ప్రయాణ ఏర్పాట్లను చేయాలని ప్రయాణికులు కోరారు.

Exit mobile version