Site icon NTV Telugu

Virender Sehwag: పాక్‌ ఎప్పటికీ మరిచిపోలేని సమాధానం ఇస్తాం..

Virender Sehwag

Virender Sehwag

Virender Sehwag: బ్యాట్‌ పట్టుకుని గ్రౌండ్‌లోకి దిగాడంటే.. ప్రత్యర్థి బౌలర్లకు చుక్కలు చూపించే టీమిండియా మాజీ క్రికెటర్‌ వీరేంద్ర సెహ్వాగ్.. సోషల్‌ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటూరు.. సమయానుకూలంగా ట్వీట్లు చేస్తూ.. కొన్ని సార్లు నవ్వులు పూయిస్తారు.. ఆలోచించపజేస్తారు.. సూచనలు, సలహాలు.. ఇలా ఎన్నో ఉంటాయి.. అయితే, భారత్ – పాకిస్తాన్‌ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో.. పాకిస్తాన్‌కు సీరియస్‌ వార్నింగే ఇచ్చాడు ఈ టీమీండియా మాజీ డాషింగ్‌ ఓపెనర్‌..

Read Also: Indian Army : పాకిస్తాన్‌ దాడిపై భారత ఆర్మీ కీలక ప్రకటన

ఎక్స్‌ (ట్విట్టర్‌) వేదికగా పాక్‌పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు వీరేంద్ర సెహ్వాగ్.. పాక్‌ యుద్ధం కోరుకుంది.. దానికి భారత్‌ సరైన గుణపాఠం చెబుతుందని పేర్కొన్నాడు.. ‘ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేసినప్పుడు పాకిస్తాన్‌ మౌనంగా ఉండాలి.. కానీ, ఆ అవకాశాన్ని వదులుకొని యుద్ధం కోరుకుంటుంది.. ఉగ్రవాదుల ఆస్తులను రక్షించడమే కాదు.. వారి గురించి ఎక్కువగా మాట్లాడటం చేశారు.. దానికి భారత భద్రతా దళాలు తప్పకుండా సరైన సమాధానం ఇస్తుంది.. పాకిస్తాన్‌ ఎప్పటికీ మరిచిపోలేని రీతిలో ఉంటుంది’ అంటూ ట్వీట్‌ చేశారు వీరేంద్ర సెహ్వాగ్..

Read Also: Ambati Rayudu: “కంటికి కన్ను.. ప్రపంచాన్ని అంధం చేస్తుంది”.. అంబటి రాయుడిపై విమర్శలు.!

కాగా, పహల్గామ్ ఉగ్రదాడితో రగిలిపోయిన భారత్‌.. ప్రతీకారంగా పాక్‌లోని ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేయగా.. పాక్‌ మాత్రం భారత్‌పై దాడికి దిగడం మొదలుపెట్టింది.. రెచ్చగొట్టేలా క్షిపణులు, ఆత్మాహుతి డ్రోన్లు, యుద్ధ విమానాలను రంగంలోకి దించింది.. అయితే, ఎలాంటి పరిస్థితిని అయినా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్న భారత ఆర్మీ.. వాటన్నింటినీ తిప్పికొడుతోన్న విషయం విదితమే..

Exit mobile version