టీమిండియా మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్.. తన సతీమణి ఆర్తి అహ్లవత్‌కు విడాకులు ఇచ్చాడని కొన్నిరోజులుగా సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. సెహ్వాగ్, ఆర్తిలు గత రెండేళ్లుగా విడిగా ఉంటున్నారని.. 20 ఏళ్ల వైవాహిక బంధానికి ఇద్దరూ ఇప్పటికే స్వస్తి పలికినట్లు తెలుస్తోంది. విడాకుల వ్యవహారంపై అధికారిక ప్రకటన అయితే లేదు. అయితే 2025 దీపావళి పండుగ నేపథ్యంలో సెహ్వాగ్ చేసిన పోస్ట్.. ఆర్తితో విడాకులు నిజమే అని స్పష్టం చేస్తోంది.
దీపావళి సందర్భంగా వీరేంద్ర సెహ్వాగ్ తన ఎక్స్ ఖాతాలో ఫొటోస్ పోస్ట్ చేసి.. ఓ సంస్కృత శ్లోకాన్ని క్యాప్షన్‌గా పేర్కొన్నారు. ఒక ఫొటోలో సెహ్వాగ్ ఒక్కడే ఉండగా.. మరో ఫొటోలో వీరూ తల్లితో పాటు అతడి ఇద్దరు కొడుకులు ఉన్నారు. ‘నువ్వు ఎక్కడికి వెళ్ళినా నీ మెరుపును వదిలి వెళ్ళు. దీపావళి శుభాకాంక్షలు’ అని రాసుకొచ్చారు. ‘దీప్జ్యోతిః పరమం బ్రహ్మం దీప్జ్యోతిర్జనార్దన్ః । దీపో హర్తు మే పాం దీప్జ్యోతిర్నమోస్తుతే ॥’ అని సంస్కృత శ్లోకాన్ని కూడా పోస్ట్ చేశారు. వీరూ పోస్ట్ చేసిన ఫోటోలలో సతీమణి ఆర్తి అహ్లవత్ లేదు. దాంతో ‘విడాకులు నిజమే’ అంటూ నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
Also Read: Palanadu News: చనిపోయి మూడు రోజులైనా.. తండ్రి మృతదేహానికి అంత్యక్రియలు చేయని కుమారులు!
2004 డిసెంబరులో వీరేంద్ర సెహ్వాగ్, ఆర్తి అహ్లావత్‌లు వివాహం చేసుకున్నారు. వీరికి కుమారులు ఆర్యవీర్ (2007), వేదాంత్ (2010) ఉన్నారు. 20 ఏళ్ల పాటు సజావుగా సాగిన వీరూ, ఆర్తిల వైవాహిక జీవితంలో 2-3 ఏళ్ల కిందట మనస్పర్థలు తలెత్తినట్లు తెలుస్తోంది. కొంతకాలంగా ఇద్దరు విడివిడిగా ఉంటున్నట్లు సమాచారం. గతేడాది దీపావళి సందర్బంగా సెహ్వాగ్ తన కుమారులు, తల్లితో దిగిన ఫొటోలను షేర్ చేయడంతో విడాకుల వార్తలు చక్కర్లు కొట్టాయి. ఇటీవల ఇద్దరూ ఒకరినొకరు ఇన్‌స్టాగ్రామ్‌లో అన్‌ఫాలో చేయడంతో విడాకుల వార్తలకు మరింత బలం చేకూరింది. ఇప్పుడు దీపావళి సందర్భంగా మరోసారి రుజువైంది. విడాకులపై అటు సెహ్వాగ్, ఇటు ఆర్తి ఇప్పటివరకు స్పందించలేదు. బీసీసీఐలో కీలక పదవిలో ఉన్న ఓ వ్యక్తి ఆర్తితో అక్రమ సంబంధం పెట్టుకున్నాడని నెట్టింట జోరుగా ప్రచారం జరుగుతోంది. ఈ విషయం తెలిసే ఆర్తిని వీరూ దూరం పెట్టాడట. ఇక భారత్ తరఫున సెహ్వాగ్ 104 టెస్టులు, 251 వన్డేలు, 19 టీ20లు ఆడారు.
