Site icon NTV Telugu

Virender Sehwag: జై షా జర చూడు.. ఇప్పుడు ఇండియా కాదు.. భారత్

Swehwag

Swehwag

మోడీ సర్కార్ సంచలన నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే రాజ్యాంగంలో అనేక మార్పులు చేసిన కేంద్ర సర్కార్.. ఇప్పుడు ఇండియా పేరునే మార్చేసే దిశగా అడుగులు వేస్తుంది. త్వరలోనే ఇండియా పేరును భారత్ గా మార్చేందుకు సన్నద్ధమవుతోంది. ఇందులో భాగంగానే ఇప్పటికే జీ-7 సమ్మిట్ లో భారత్ అని ముద్రించింది. ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా విపక్షాలు కూటమి ఏర్పాటు చేశాయి. ఆ కూటమి కి ఇండియా పేరును ఫైనల్ చేశారు.

Read Also: Akkineni Naga Chaitanya: చై- శోభితా.. మళ్లీ అడ్డంగా దొరికేశారే ..?

అయితే కూటమి నిర్ణయం నేపథ్యంలోనే నరేంద్ర మోడీ ప్రభుత్వం ఇండియా పేరును భారత్ గా మార్చబోతుందని విమర్శలు వస్తున్నాయి. ఇందులో భాగంగానే ఈనెల 18వ తేదీ నుంచి పార్లమెంటు సమావేశాలు నిర్వహిస్తుంది. ఈ పార్లమెంట్ సెసన్స్ లోనే భారత్ గా పేరు మార్చబోతుందని టాక్. ఈ తరుణంలో టీమిండియా మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

Read Also: Prabhas: ప్రభాస్ కి ఇష్టమైన రొయ్యల పలావ్ రెసిపీ ఇదే.. ఇక చరణ్ వంతు!

స్వెహ్వాగ్ ఇప్పటికే త‌న ట్విట‌ర్‌ బ‌యోలో భార‌తీయుడిగా గ‌ర్విస్తున్నా అని మార్చుకున్నాడు.. నెదర్లాండ్స్, మయన్మార్‌లను భారత్ స్ఫూర్తిగా తీసుకుని మెగా ఈవెంట్ కోసం తమ జెర్సీలపై పేరు మార్చుకోవాలని సెహ్వాగ్ కోరారు. ఈ మేర‌కు వ‌రుస ట్వీట్లు చేశాడు. 1996 వ‌న్డే వరల్డ్ కప్ లో నెద‌ర్లాండ్ జట్టు హాలండ్ పేరుతో ఆడగా.. 2003లో మేం ఆ జ‌ట్టుతో ఆడిన‌ప్పుడు నెద‌ర్లాండ్స్ పేరుతోనే బ‌రిలోకి దిగారు అని ఆయన పేర్కొన్నారు.

Read Also: Anushka Shetty : తన పెళ్లి గురించి ఆసక్తి కర వ్యాఖ్యలు చేసిన అనుష్క..

బ్రిటిష్ వారు పెట్టిన‌ పేరును బ‌ర్మా మ‌ళ్లీ మ‌య‌న్మార్‌గా మార్చుకుంది.. ఇలా చాలా దేశాలు మ‌ళ్లీ అస‌లు పేరుకు మారాయని వీరేంద్ర సెహ్వాగ్ ఓ ట్వీట్‌లో తెలిపాడు. మన అసలు పేరు భారత్ అధికారికంగా తిరిగి రావడానికి చాలా కాలం గడిచిపోయిందని అని వీరేంద్ర సెహ్వాగ్ అన్నాడు. అక్టోబర్ 5వ తేదీ నుంచి ప్రారంభమయ్యే వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నమెంట్లో.. టీమిండియా ఆటగాళ్లు.. భారత్ అని రాసి ఉన్న జెర్సీలతోనే క్రికెట్ ఆడాలని ఆయన సూచించారు. ఈ మేరకు బీసిసిఐ కార్యదర్శి అమిత్ షా కొడుకు జై షా కు టీమిండియా మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ విజ్ఞప్తి చేశారు.

Exit mobile version