Virat Kohli: స్టాండ్స్‌లో ‘49’ హంగామా.. కోహ్లీ రియాక్షన్ మాములుగా లేదుగా..!

Virat Kohli

Virat Kohli

Virat Kohli: శుక్రవారం హైదరాబాద్ వేదికగా జరిగిన సన్ రైజర్స్ హైదరాబాద్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మ్యాచ్‌లో SRH 55 పరుగులతో RCBపై ఘానా విజయం సాధించిన సంగతి తెలిసిందే. అయితే SRH బ్యాటింగ్ చేస్తున్న సమయంలో ఓ ఆసక్తికర సంఘటన సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. బౌండరీ లైన్ వద్ద ఫీల్డింగ్ చేస్తున్న విరాట్ కోహ్లీ వైపు ఓ అభిమాని “49” అని సూచించే జెశ్చర్ చూపించడం ఇప్పుడు చర్చనీయాంశమైంది.

సన్‌రైజర్స్ హైదరాబాద్ ఇన్నింగ్స్ సమయంలో కోహ్లీ బౌండరీ దగ్గర ఫీల్డింగ్ చేస్తుండగా.. ఆ సమయంలో స్టాండ్స్‌లో ఉన్న ఓ ప్రేక్షకుడు పలుమార్లు “49” అనే సంకేతాన్ని కోహ్లీ వైపు చూపిస్తూ కెమెరాకు చిక్కాడు. ఈ “49” జెశ్చర్ 2017 ఐపీఎల్ సీజన్‌లో ఆర్సీబీ ఎదుర్కొన్న చేదు రికార్డును గుర్తు చేస్తోంది. అప్పట్లో కోల్కతా నైట్ రైడర్స్ తో జరిగిన మ్యాచ్‌లో RCB కేవలం 49 పరుగులకే ఆలౌట్ అయింది. ఐపీఎల్ చరిత్రలో ఓ జట్టు చేసిన అత్యంత తక్కువ స్కోర్‌గా నిలిచింది. అప్పటి నుంచి ఈ సంఖ్యను ప్రత్యర్థి అభిమానులు సరదా ట్రోలింగ్‌లో భాగంగా ఉపయోగిస్తూ వస్తున్నారు.

స్టేడియంలో జరిగిన ఈ ఘటన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అభిమానుల మధ్య పెద్ద ఎత్తున చర్చ మొదలైంది. హై వోల్టాజ్ మ్యాచ్‌ లలో ప్రేక్షకుల ప్రవర్తన ఎక్కడ వరకు ఉండాలి అనే అంశంపై కూడా నెటిజన్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ సెటైర్‌పై కోహ్లీ ఎలాంటి స్పందన చూపలేదు. ఎప్పటిలాగే ప్రశాంతంగా తన ఫీల్డింగ్‌పై దృష్టి పెట్టిన అతడు, మ్యాచ్ మొత్తం తన ఆటపైనే ఫోకస్ కొనసాగించాడు. అయితే ఎప్పుడు తన ఎమోషన్స్ ను దాచుకోని కోహ్లీ.. ఈసారి మాత్రం ఆ జెశ్చర్ ను కూడా చూసి సైలెంట్ గా ఉండడంతో అభిమానులు ఆశర్యం వ్యక్తం చేస్తున్నారు.