Site icon NTV Telugu

Virat Kohli: నువ్వు నిజంగా ఓడిపోతావు.. విరాట్ కోహ్లీకి ఏమైంది?

Virat Kohli Cry

Virat Kohli Cry

టీమిండియా సీనియర్ ప్లేయర్ విరాట్ కోహ్లీ ప్రస్తుతం ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్ళాడు. సుమారు 7 నెలలు తర్వాత బరిలోకి దిగడంతో ఫ్యాన్స్ అందరు కింగ్ ఆట కోసం ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. అయితే ఆస్ట్రేలియా పర్యటనకు చేరుకున్న కొన్ని గంటల్లోనే కోహ్లీ చేసిన ఒక పోస్ట్ సోషల్ మీడియాలో కలకలం రేపింది. ఆస్ట్రేలియాతో జరగబోయే మూడు వన్డే మ్యాచ్‌ల సిరీస్‌కు సిద్ధమవుతున్న నేపథ్యంలో కోహ్లీ చేసిన ఒక మెసేజ్ తన వన్డే భవిష్యత్తుపై తీవ్ర చర్చకు దారి తీసింది.

Also Read: Kriti Sanon: తొలి భారతీయ మహిళా నటిగా ‘కృతి సనన్‌’ చరిత్ర!

2027 వన్డే ప్రపంచకప్ దృష్ట్యా విరాట్ కోహ్లీ చేసిన ఈ వ్యాఖ్యలు అభిమానులలో మరింత ఆసక్తిని పెంచాయి. ‘నువ్వు వదిలేయాలని నిర్ణయించుకున్నప్పుడే, నువ్వు నిజంగా ఓడిపోతావు’ అంటూ విరాట్ కోహ్లీ పోస్ట్ చేశాడు. దీంతో ఈ ట్వీట్ వెంటనే వైరల్‌గా మారింది. కోహ్లీకి ఏమైంది? అంటూ ఫాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. అసలు ఈ పోస్ట్ పెట్టడం వెనుక ఉన్న అసలు అర్థం ఏమిటని అభిమానులు, నెటిజన్లు చర్చించుకుంటున్నారు. అయితే ఈ పోస్ట్ టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ఇటీవల చేసిన వ్యాఖ్యలకు కౌంటర్‌గా పెట్టాడని కొందరు ఫ్యాన్స్ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైనా ఈ సిరీస్‌లో కోహ్లీ సరిగ్గా ఆడకపోతే అతడి భవిష్యత్తుపై నీలినీడలు కమ్ముకోనున్నాయి.

Exit mobile version