NTV Telugu Site icon

Virat Kohli: ఇక మీ ట్రోల్ల్స్ ఆపండి.. ముంబై ఫాన్స్ పై విరాట్ కోహ్లీ.. వీడియో వైరల్..!

1.

1.

బుధవారం నాడు ముంబై వేదికగా ఐపిఎల్ 2024 లో భాగంగా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, ముంబై ఇండియన్స్ తలపడగా ముంబై ఇండియన్స్ 7 వికెట్ల విజయాన్ని అందుకుంది. ఈ మ్యాచ్ లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఓటమి చూసినప్పటికీ.. జట్టులో ఉన్న స్టార్ బ్యాట్స్మెన్ విరాట్ కోహ్లీ మాత్రం మరోసారి తన మంచి మనసును చాటుకున్నాడు. ఇందులో భాగంగా ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యాకు కోహ్లీ సపోర్టుగా నిలచడంతో అందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం ట్రెండింగ్ గా మారింది. లక్ష్య ఛేదనలో బ్యాటింగ్ చేస్తున్న ముంబై ఇండియన్స్ జట్టు రోహిత్ శర్మ వికెట్ కోల్పోయిన తర్వాత హార్థిక్ పాండ్య వచ్చాడు. అయితే అతను క్రీజ్ లోకి వచ్చే సమయంలో ముంబై అభిమానులు స్టాండ్స్ నుండి పెద్దగా అరుస్తూ హేళన చేశారు.

Also read: Uppal Tickets: హైదరాబాద్ క్రికెట్ అభిమానులకు మరోసారి నిరాశే.. నిమిషానికే టికెట్లు సోల్డ్‌ అవుట్‌!

దాంతో వెంటనే కోహ్లీ కాస్త ప్రేక్షకుల వైపు తిరిగి చూస్తూ హార్దిక్ పాండ్యాను హేళన చేయవద్దని కోరాడు. ఇక దయచేసి ఆపండి.. అన్నట్లుగా కోహ్లీ సైగలు చూస్తుంటే అర్థమవుతుంది. కోహ్లీ అభిమానుల వైపు తిరిగి ఏంటిది అన్నట్లుగా రియాక్షన్ ఇచ్చాడు. దాంతో వెంటనే ముంబై అభిమానులు హార్దిక్.. హార్దిక్.. అంటూ గట్టిగా అరిచారు. ప్రస్తుతం అందుకు సంబంధించి వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది.

Also read: Botsa Satyanarayana: కూటమికి సమాజ శ్రేయస్సు కంటే.. సామాజిక ఇంట్రెస్ట్ ఎక్కువ.. !

ఇకపోతే హార్థిక్ పాండే ముంబై ఇండియన్స్ కెప్టెన్సీ బాధ్యతలు తీసుకున్నప్పటి నుంచి ముంబై అభిమానుల నుంచి కాస్త వ్యతిరేకతని ఎదుర్కొంటున్నాడు. ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్ సీజన్లో ముంబై ఇండియన్స్ తొలి మూడు మ్యాచ్ లలో ఓడిపోవడంతో ఆ వ్యతిరేకత మరింత ఎక్కువైంది. దీంతో మైదానంలో కనిపిస్తే చాలు అతనిని ముంబై అభిమానులు టార్గెట్ చేస్తూనే ఉన్నారు. ముంబై ఇండియన్స్ తాజాగా జరిగిన రెండు మ్యాచ్ లలో గెలవడంతో కాస్త ముంబై ఫ్యాన్స్ శాంతించారు. చూడాలి మరి ముందు ముందు హార్దిక్ ను ఇప్పుడు ముంబై ఇండియన్స్ అభిమానులు ఏ విధంగా స్వీకరిస్తారో.