NTV Telugu Site icon

WPL Final-Virat Kohli: స్మృతి మంధానకు విరాట్ కోహ్లీ వీడియో కాల్.. ఏమన్నాడంటే?

Virat Kohli Congratulations Rcb

Virat Kohli Congratulations Rcb

Virat Kohli Congratulations RCB after Win WPL 2024 Title: 2008 నుంచి ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌)లో రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు (ఆర్‌సీబీ) ఫ్రాంచైజీ ఆడుతోంది. ఐపీఎల్‌లో ఆర్‌సీబీ మూడుసార్లు ఫైనల్ చేరినా.. టైటిల్‌ను మాత్రం అందుకోలేకపోయింది. ఇదే ఆర్‌సీబీ ఫ్రాంచైజీ గత ఏడాది మొదలైన మహిళల ప్రీమియర్‌ లీగ్‌ (డబ్ల్యూపీఎల్‌)లో అడుగుపెట్టింది. తొలి సీజన్‌లో అందరినీ నిరాశపరుస్తూ.. పట్టికలో నాలుగో స్థానంతో సరిపెట్టుకుంది. అయితే ఈ ఏడాది మహిళా జట్టు అద్భుతం చేసింది. పురుషుల జట్టుకు అందని ద్రాక్షగా ఉన్న టైటిల్‌ను.. డబ్ల్యూపీఎల్‌లో కైవసం చేసుకుంది.

తొలి టైటిల్‌ దక్కడంతో రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు ప్లేయర్స్, అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. డబ్ల్యూపీఎల్‌ 2024 ఫైనల్‌లో ఆర్‌సీబీ గెలవగానే.. టీమిండియా స్టార్ బ్యాటర్, ఆర్‌సీబీ పురుషుల జట్టు మాజీ సారథి విరాట్ కోహ్లీ సంబరాలు చేసుకున్నాడు. అంతేకాదు మైదానంలో ఉన్న ఆర్‌సీబీ కెప్టెన్ స్మృతి మంధానకు వీడియో కాల్ చేసి కంగ్రాట్స్ చెప్పాడు. ఆపై ఆర్‌సీబీ జట్టు సభ్యులతో కూడా విరాట్ మాట్లాడాడు. ఇందుకు సంబందించిన ఫొటోస్, వీడియోస్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

Also Read: WPL 2024: డబ్ల్యూపీఎల్‌ 2024 విజేత ప్రైజ్‌మనీ ఎంతంటే?.. ఆరెంజ్‌ క్యాప్‌, పర్పుల్‌ క్యాప్‌ ఎవరికంటే!

ఐపీఎల్ 2024 కోసం ఆదివారం ఉదయం విరాట్ కోహ్లీ లండన్ నుంచి భారత్‌కు వచ్చాడు. ఎయిర్‌పోర్ట్ నుంచి బయటకు వస్తున్న విరాట్ వీడియో, ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. తన భార్య అనుష్క శర్మ కుమారుడు అకాయ్‌కు జన్మనివ్వడంతో కోహ్లీ..జాతీయ జట్టు నుంచి విరామం తీసుకున్న విషయం తెలిసిందే. గత 16 ఏళ్లుగా ఆర్‌సీబీ తరఫున ఆడుతున్న కోహ్లీ.. ఈసారైనా ఐపీఎల్‌ ట్రోఫీని సాధించాలనే పట్టుదలతో కనిపిస్తున్నాడు. మార్చి 22న లీగ్‌ తొలి మ్యాచ్‌లో డిఫెండింగ్‌ చాంపియన్‌ చెన్నై సూపర్‌ కింగ్స్‌తో ఆర్‌సీబీ తలపడుతుంది.