WPL Final-Virat Kohli: స్మృతి మంధానకు విరాట్ కోహ్లీ వీడియో కాల్.. ఏమన్నాడంటే?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Virat Kohli Congratulations RCB after Win WPL 2024 Title: 2008 నుంచి ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ) ఫ్రాంచైజీ ఆడుతోంది. ఐపీఎల్‌లో ఆర్‌సీబీ మూడుసార్లు ఫైనల్ చేరినా.. టైటిల్‌ను మాత్రం అందుకోలేకపోయింది. ఇదే ఆర్‌సీబీ ఫ్రాంచైజీ గత ఏడాది మొదలైన మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్)లో అడుగుపెట్టింది. తొలి సీజన్‌లో అందరినీ నిరాశపరుస్తూ.. పట్టికలో నాలుగో స్థానంతో సరిపెట్టుకుంది. అయితే ఈ ఏడాది మహిళా జట్టు అద్భుతం చేసింది. పురుషుల జట్టుకు అందని ద్రాక్షగా ఉన్న టైటిల్‌ను.. డబ్ల్యూపీఎల్‌లో కైవసం చేసుకుంది.
తొలి టైటిల్ దక్కడంతో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ప్లేయర్స్, అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. డబ్ల్యూపీఎల్ 2024 ఫైనల్‌లో ఆర్‌సీబీ గెలవగానే.. టీమిండియా స్టార్ బ్యాటర్, ఆర్‌సీబీ పురుషుల జట్టు మాజీ సారథి విరాట్ కోహ్లీ సంబరాలు చేసుకున్నాడు. అంతేకాదు మైదానంలో ఉన్న ఆర్‌సీబీ కెప్టెన్ స్మృతి మంధానకు వీడియో కాల్ చేసి కంగ్రాట్స్ చెప్పాడు. ఆపై ఆర్‌సీబీ జట్టు సభ్యులతో కూడా విరాట్ మాట్లాడాడు. ఇందుకు సంబందించిన ఫొటోస్, వీడియోస్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
Also Read
- Iran Crisis: సంక్షోభంలో ఇరాన్.. బతకడానికి ‘‘జుట్టు’’ అమ్ముకుంటున్న జనాలు..
- AP High Court: డీఎస్సీ-2025 పిల్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.. రాజకీయ ప్రయోజనాలకు పిల్‌ను వాడొద్దు..!
- Sunetra Pawar: సునేత్ర పవార్‌ను ‘గూంగీ గుడియా’ అన్న కాంగ్రెస్.. దుమారం రేపుతోన్న వ్యాఖ్యలు
- Colleges Closed: విద్యార్థులకు బిగ్ అలర్ట్.. రేపు విద్యాసంస్థలు బంద్..
Also Read: WPL 2024: డబ్ల్యూపీఎల్ 2024 విజేత ప్రైజ్‌మనీ ఎంతంటే?.. ఆరెంజ్ క్యాప్, పర్పుల్ క్యాప్ ఎవరికంటే!
ఐపీఎల్ 2024 కోసం ఆదివారం ఉదయం విరాట్ కోహ్లీ లండన్ నుంచి భారత్‌కు వచ్చాడు. ఎయిర్‌పోర్ట్ నుంచి బయటకు వస్తున్న విరాట్ వీడియో, ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. తన భార్య అనుష్క శర్మ కుమారుడు అకాయ్‌కు జన్మనివ్వడంతో కోహ్లీ..జాతీయ జట్టు నుంచి విరామం తీసుకున్న విషయం తెలిసిందే. గత 16 ఏళ్లుగా ఆర్‌సీబీ తరఫున ఆడుతున్న కోహ్లీ.. ఈసారైనా ఐపీఎల్ ట్రోఫీని సాధించాలనే పట్టుదలతో కనిపిస్తున్నాడు. మార్చి 22న లీగ్ తొలి మ్యాచ్‌లో డిఫెండింగ్ చాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్‌తో ఆర్‌సీబీ తలపడుతుంది.
Virat Kohli was literally dancing on the video call. This Trophy matters sooo much to him pic.twitter.com/QfDnmbgbAT
— Pari (@BluntIndianGal) March 18, 2024
తాజావార్తలు
-
Tejaswi Rao: ఇక పద్ధతిగా ఉంటే కుదరదు.. అందాల విందుతో రాంబాయి అరాచకం!
-
‘Raaka’ Glimpse: ‘రాకా’ ఫ్యాన్స్‌కు షాక్.. ఇప్పటి వరకు ఊరించిందంతా ఉత్తిదేనా?
-
Iran Crisis: సంక్షోభంలో ఇరాన్.. బతకడానికి ‘‘జుట్టు’’ అమ్ముకుంటున్న జనాలు..
-
AP High Court: డీఎస్సీ-2025 పిల్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.. రాజకీయ ప్రయోజనాలకు పిల్‌ను వాడొద్దు..!
-
Raashi Khanna: హే రాశి.. ఇప్పుడెందుకీ క్లీవేజ్ షో?
ట్రెండింగ్
-
Baba Vanga Prediction 2026: బాబా వంగా జోస్యం.. ఈ 5 రాశులకు కోటీశ్వర యోగం.!
-
Jowar Dry Fruits Laddu: ప్రోటీన్ రిచ్ ‘జొన్న డ్రై ఫ్రూప్ట్స్ లడ్డు’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా..!
-
Zodiac Predictions : ఆగస్టు 5న బుధ-గురు మహాయోగం.. ఈ 4 రాశులకు డబ్బే డబ్బు.!
-
Kitchen Hacks : అరటి తొక్కతో ఈ మ్యాజిక్ తెలుసా? బేకింగ్ సోడా కలిపితే సూపర్ రిజల్ట్.!
-
IndiGo Offer : ఇండిగో బంపర్ ఆఫర్.. 20 వేల ఉచిత టికెట్లు.!