Site icon NTV Telugu

Virat Kohli: హైదరాబాద్‌ జిమ్‌లో విరాట్ కోహ్లీ.. ఫ్యాన్స్ హంగామా

Virat Kohli

Virat Kohli

Virat Kohli: టీమిండియా స్టార్‌ క్రికెటర్‌, మాజీ కెప్టెన్ విరాట్‌ కోహ్లీ హైదరాబాద్‌లోని మణికొండలో సందడి చేశాడు. న్యూజిలాండ్‌తో మొదటి వన్డే కోసం సిటీకి వచ్చిన కింగ్ కోహ్లీ అనంతరం మణికొండ గ్రీన్‌ లివింగ్‌ అపార్ట్‌మెంట్‌లోని ఓ జిమ్‌లో యాడ్‌ షూటింగ్‌కు హాజరయ్యాడు. ఈ విషయం తెలుసుకున్న ఫ్యాన్స్ పెద్ద ఎత్తున జిమ్ దగ్గర గుమిగూడారు. దీనికి సంబంధించిన వీడియోలను అభిమానులు సామాజిక మాధ్యమాల్లో షేర్ చేస్తూ తమ ఆనందాన్ని పంచుకుంటున్నారు. దీంతో ఈ ఫొటోలు, వీడియోలు ఫుల్ వైరల్‌గా మారాయి.

Anchor Falls: యాంకర్‌పై పడిపోయిన ఫీల్డర్.. నవ్వులే నవ్వులు

కాగా, ఉప్పల్‌ స్టేడియం వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన తొలి వన్డేలో టీమిండియా 12 రన్స్ తేడాతో విజయం సాధించింది. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన భారత జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 349 పరుగులు చేసింది. యంగ్ ఓపెనర్ శుభ్‌మన్ గిల్ (149 బంతుల్లో 208) డబుల్ సెంచరీతో మెరిశాడు. ఈ మ్యాచ్‌లో కోహ్లీ 8 పరుగులు మాత్రమే చేశాడు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన న్యూజిలాండ్ 49.2 ఓవర్లలో 337 రన్స్‌కు ఆలౌటైంది. మిచెల్ బ్రేస్‌వెల్ (78 బంతుల్లో 140) సూపర్ సెంచరీతో జట్టును విజయానికి దగ్గరగా తీసుకెళ్లాడు. కానీ మిగతా బ్యాటర్ల నుంచి సపోర్ట్ లేకపోవడంతో కివీస్‌కు ఓటమి తప్పలేదు. ఇక ఇరుజట్ల మధ్య రెండో వన్డే రాయ్‌పూర్‌ వేదికగా జనవరి 21న జరగనుంది.

Exit mobile version