Site icon NTV Telugu

Virat Kohli Dhurandhar 2 Review: “ధురంధర్-2” చూసి విరాట్ కోహ్లీ షాక్.. సినిమాపై కింగ్ హాట్ రివ్యూ!

Virat Kohli Reviews Dhurandhar 2

Virat Kohli Reviews Dhurandhar 2

Virat Kohli Dhurandhar 2 Review: భారత్ క్రికెట్ దిగ్గజం విరాట్ కోహ్లీ తాజాగా బ్లాక్‌బస్టర్ చిత్రం ‘ధురందర్ 2’ సినిమా చూశారు. తన అభిప్రాయాన్ని సోషల్ మీడియాలో పంచుకున్నాడు. దర్శకుడు ఆదిత్య ధర్, కథానాయకుడు రణవీర్ సింగ్‌లను ప్రశంసిస్తూ ఇది తన జీవితంలోనే అత్యుత్తమ ‘సినిమాటిక్ అనుభవం’ అని విరాట్ తెలిపాడు. భారత్‌ ఇలాంటి సినిమా అనుభవాన్ని తాను ఇంతకు ముందెన్నడూ చూడలేదని కొనియాడాడు. దాదాపు 4 గంటల నిడివి ఉన్న ఈ చిత్రం ప్రతి క్షణం ఉత్కంఠభరితంగా సాగిందని, ఒక్క నిమిషం కూడా కళ్లు తిప్పుకోలేకపోయానని కోహ్లీ తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో పేర్కొన్నారు.

READ MORE: Donald Trump: మనలోనే ‘‘గూఢచారి’’ ఉన్నాడు.. మీడియాకు ట్రంప్ వార్నింగ్..

ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో ‘ధురందర్ 2’ పోస్టర్‌ను పోస్ట్ చేసిన విరాట్.. “ఈ రోజే సినిమా చూశాను. ఇలాంటి ఒక అద్భుతమైన సినిమా అనుభవం ఇండియాలో ఇంతకుముందెన్నడూ చూడలేదని ఖచ్చితంగా చెప్పగలను. దాదాపు 4 గంటల పాటు కనురెప్ప వేయకుండా చూశాను, నాలో ప్రతి భావోద్వేగాన్ని ఈ సినిమా తట్టిలేపింది. డైరెక్టర్ ఆదిత్యా ధర్ మీ ప్రతిభ, పట్టుదల మీరు సృష్టించిన ఈ అద్భుతంలో కనిపిస్తున్నాయి. మీకు నా హ్యాట్సాఫ్. మీరు ఒక జీనియస్. ఇక నటీనటులందరూ తమ పాత్రల్లో ఒదిగిపోయినప్పటికీ.. రణవీర్ ఈ సినిమా తర్వాత మీరు ఒక కొత్త శిఖరాన్ని చేరుకున్నారు. మీ నటన అద్భుతానికి మించి ఉంది. అబ్సల్యూట్లీ వావ్!” అని రాసుకొచ్చాడు.

READ MORE: Artemis 2: 40 నిమిషాల పాటు భూమితో సంబంధాలు కోల్పోయిన ఆర్టెమిస్ 2.. కారణమిదే..

మరోవైపు. బాక్సాఫీస్ వద్ద కూడా ‘ధురంధర్ 2’ రికార్డుల వేట కొనసాగిస్తోంది. ఈ సినిమా ప్రయాణం ఆరంభం నుంచే ప్రభంజనం సృష్టించింది. జియో స్టూడియోస్ గణాంకాల ప్రకారం, విడుదలైన రెండు వారాల్లోనే ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా ఏకంగా రూ. 1622 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించింది. ఇందులో విదేశీ వసూళ్లు ఏప్రిల్ 6 నాటికి రూ. 394 కోట్లుగా ఉండగా, దేశీయంగా రూ. 1228 కోట్ల గ్రాస్ (రూ. 1041 కోట్ల నెట్) వసూళ్లను రాబట్టింది. 18వ రోజున కూడా భారతవ్యాప్తంగా 14,229 షోల ద్వారా రూ. 28.75 కోట్ల నెట్ వసూళ్లను సాధించి తన సత్తా చాటుతోంది.

Exit mobile version