బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా జరుగుతోన్న రెండో టెస్టు రసవత్తరంగా సాగుతోంది. మొదటి ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా 263 రన్స్‌కు ఆలౌటవగా.. బ్యాటింగ్ చేస్తున్న భారత్ రెండో రోజు లంచ్ బ్రేక్ సమయానికి 4 వికెట్లు కోల్పోయి 88 పరుగులు చేసింది. ఓవర్‌నైట్ స్కోర్ 21/0తో రెండో రోజు బ్యాటింగ్ కొనసాగించిన భారత్‌కు ఆదిలోనే షాక్ తగిలింది. ఓపెనర్ రాహుల్ (17) లియోన్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. క్రీజులో నిలదొక్కుకునేందుకు ప్రయత్నిస్తున్న రోహిత్ (32)తో పాటు వందో టెస్టు ఆడుతున్న పుజారా(0)ను ఒకే ఓవర్లో ఔట్ చేసిన లియోన్..టీమిండియాను గట్టి దెబ్బ తీశాడు. ఇక కొద్దిసేపటికే శ్రేయస్ అయ్యర్ (4) కూడా పెవిలియన్ చేరడంతో 66 రన్స్‌కే 4 కీలక వికెట్లు కోల్పోయిన ఇండియా కష్టాల్లో పడింది. ప్రస్తుతం క్రీజులో విరాట్ కోహ్లీ (14 బ్యాటింగ్), రవీంద్ర జడేజా (15 బ్యాటింగ్) ఉన్నారు. ఆసీస్ బౌలర్లలో లియోన్‌కు ఈ నాలుగు వికెట్లు దక్కడం విశేషం.
Also Read: Income Tax survey on BBC: బీబీసీ లావాదేవీలపై ఐటీశాఖ రిపోర్ట్.. కీలక అంశాల ప్రస్తావన