NTV Telugu Site icon

Virat Kohli: బ్రో.. తెల్లగడ్డం వస్తుంది.. జర చూసుకోరాదే

Virat

Virat

Virat Kohli: హీరోలు సినిమాల్లోనే ఉంటారా.. అంటే .. నోనో.. నో అంటూ చెప్పుకొస్తారు. ముఖ్యంగా క్రికెటర్ విరాట్ కోహ్లీని చూస్తే.. అసలు ఆయన హీరోనా.. ? క్రికెటరా.. ? అని డౌట్ రాకమానదు. ఎందుకంటే విరాట్ ఫిట్ నెస్.. డ్రెస్సింగ్ స్టైల్.. అలా ఉంటాయి మరి. ఇక భార్య అనుష్క శర్మతో యాడ్స్ చేసిన ప్రతిసారి ఆయన అభిమానులు మీరిద్దరూ ఎందుకని ఒక సినిమా చేయకూడదు అని అడక్క మానరు. ఎలాగూ అనుష్క హీరోయిన్ కాబట్టి ప్రాబ్లెమ్ కూడా లేదు. ఇక నిత్యం సోషల్ మీడియాలో ఈ జంట.. తమ జీవితంలో గడిపిన అద్భుతమైన మూమెంట్స్ ను ఫోటోల రూపంలోనో.. వీడియో రూపంలోనో అభిమానులతో పంచుకుంటూ ఉంటారు. ఈ నేపథ్యంలోనే విరాట్ తాజాగా ఒక ఫోటోను షేర్ చేశాడు. కారులో అనుష్క.. సెల్ఫీ తీసినట్టుగా ఉంది ఆ ఫోటో. అయితే ఈ ఫోటోలో కొద్దిగా ముసలితనం వచ్చినవాడిలా కనిపించాడు. గెడ్డం నెరిసి తెల్లగా కనిపిస్తుంది. దీంతో అభిమానులు .. ఆ ఫోటోను నెట్టింట వైరల్ గా మార్చేశారు.

ODI World Cup 2023: వన్డే ప్రపంచకప్‌కు అర్హత సాధించిన శ్రీలంక.. ఒక స్థానం కోసం 3 జట్లు పోటీ..!

విరాట్ అన్నా.. తెల్లగడ్డం వస్తుంది.. జర చూసుకోరాదే అని కొందరు.. విరాట్ .. కలర్ వేసుకోలేదా అని మరికొందరు చెప్తుండగా.. ఇంకొందరు మాత్రం విరాట్ ఎలా ఉన్నా కూడా అందంగానే ఉంటాడు అని చెప్పుకొస్తున్నారు. ఇకపోతే ప్రస్తుతం విరాట్ లండన్ లో ఉన్నట్లు తెలుస్తోంది. వెస్ట్ ఇండీస్ లో జూన్ 14 నుంచి మ్యాచ్ మొదలుకానున్న విషయం తెల్సిందే. ఇప్పటికే ఇండియా టీమ్ మొత్తం వెస్ట్ ఇండీస్ లో ల్యాండ్ అయ్యారు. అయితే విరాట్ ఇంకా అనుష్కతో వెకేషన్ లోనే ఉన్నారని అంటున్నారు. మరి ఈ వెకేషన్ ను ఎప్పుడు పూర్తిచేసి.. ఎప్పుడు విరాట్ వెస్ట్ ఇండీస్ చేరుకుంటాడో చూడాలి.

Show comments