Site icon NTV Telugu

Virat Kohli: మరో మైలురాయికి చేరువలో కోహ్లీ.. 6 పరుగులు సాధిస్తే..

Virat Kohli Ipl Title

Virat Kohli Ipl Title

Virat Kohli: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2024 మొదటి మ్యాచ్ చెన్నై సూపర్ కింగ్స్ (CSK), రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) జట్ల మధ్య జరుగుతుంది. చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో జరగనున్న ఈ మ్యాచ్‌లో అందరి దృష్టి ఆర్సీబీ స్టార్ బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లీపైనే ఉంది. ఈ మ్యాచ్‌లో కోహ్లీ భారీ రికార్డు సృష్టించే అవకాశం ఉంది. ఈ మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ 6 పరుగులు చేసిన వెంటనే టీ20 క్రికెట్‌లో 12 వేల పరుగులు పూర్తి చేసిన బ్యాటర్‌గా నిలుస్తాడు. ప్రపంచంలో ఆరో బ్యాట్స్‌మెన్‌గానూ, భారత్‌ నుంచి ఈ ఘనత సాధించిన తొలి బ్యాట్స్‌మెన్‌గానూ కోహ్లీ నిలవనున్నాడు. విదేశీ బ్యాట్స్‌మెన్లలో క్రిస్ గేల్, షోయబ్ మాలిక్, కీరన్ పొలార్డ్, అలెక్స్ హేల్స్, డేవిడ్ వార్నర్ కూడా ఈ ఘనత సాధించారు. కోహ్లీ ఇప్పటివరకు 376 టీ20 మ్యాచ్‌లు ఆడి 11994 పరుగులు చేశాడు. టీ20 ఇంటర్నేషనల్ (భారత్), ఆర్‌సీబీ ఫ్రాంచైజీ, డొమెస్టిక్ టీ20లను కలిపి కోహ్లీ ఈ పరుగులు సాధించాడు.

టీ20 క్రికెట్‌లో అత్యధిక పరుగులు (14562 పరుగులు) చేసిన రికార్డు కరీబియన్ లెజెండ్ క్రిస్ గేల్ పేరిట ఉంది. గేల్ తర్వాత షోయబ్ మాలిక్ (13360), కీరన్ పొలార్డ్ (12900), అలెక్స్ హేల్స్ (12319), డేవిడ్ వార్నర్ (12065) ఉన్నారు. భారత బ్యాట్స్‌మెన్లలో కోహ్లీ తర్వాత రోహిత్ శర్మ (11156 పరుగులు) రెండో స్థానంలో ఉన్నాడు. శిఖర్ ధావన్ (9645 పరుగులు) మూడో స్థానంలో నిలిచాడు. ఈ మ్యాచ్‌లో కోహ్లి 15 పరుగులు చేస్తే ఐపీఎల్‌లో సీఎస్‌కేపై 1000 పరుగులు కూడా పూర్తి చేసినట్లు అవుతుంది.

టీ-20 క్రికెట్‌లో అత్యధిక పరుగులు
• క్రిస్ గేల్- 463 మ్యాచ్‌లు, 14562 పరుగులు, 36.22 సగటు, 22 సెంచరీలు, 88 అర్ధసెంచరీలు.
• షోయబ్ మాలిక్- 542 మ్యాచ్‌లు, 13360 పరుగులు, 36.40 సగటు, 83 అర్థశతకాలు
• కీరన్ పొలార్డ్- 660 మ్యాచ్‌లు, 12900 పరుగులు, 31.46 సగటు, 1 సెంచరీ, 59 అర్ధశతకాలు
• అలెక్స్ హేల్స్- 449 మ్యాచ్‌లు, 12319 పరుగులు, 29.68 సగటు, 6 సెంచరీలు, 78 అర్ధసెంచరీలు.
• డేవిడ్ వార్నర్- 370 మ్యాచ్‌లు, 12065 పరుగులు, 37.12 సగటు, 8 సెంచరీలు, 101 అర్ధసెంచరీలు.
• విరాట్ కోహ్లీ- 376 మ్యాచ్‌లు, 11994 పరుగులు, 41.21 సగటు, 8 సెంచరీలు, 91 అర్ధసెంచరీలు.

ఐపీఎల్ 2024లో విరాట్ కోహ్లీ ఆడటంపై ఆర్సీబీ అభిమానుల్లో ఉత్కంఠ వాతావరణం నెలకొంది. దక్షిణాఫ్రికా, ఆర్‌సీబీ మాజీ క్రికెటర్‌ ఏబీ డివిలియర్స్‌కు కూడా కోహ్లీపై అపారమైన నమ్మకం ఉంది. శుక్రవారం (మార్చి 22) నుంచి ప్రారంభమయ్యే ఐపీఎల్‌లో కోహ్లీ అత్యుత్తమ ప్రదర్శన ఇస్తాడని డివిలియర్స్ ఆశాభావం వ్యక్తం చేశాడు.

Exit mobile version