NTV Telugu Site icon

Virat Kohli: మరో రికార్డుకు దగ్గర్లో.. 21 పరుగులు సాధిస్తే చాలు

Virat Kohli Duck

Virat Kohli Duck

బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ నవంబర్ 22 (శుక్రవారం) నుంచి మొదలుకానుంది. పెర్త్‌లోని ఆప్టస్ స్టేడియం వేదికగా తొలి టెస్ట్ మ్యాచ్ జరగనుంది. అయితే.. టీమిండియా స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. పెర్త్ మైదానంలో అతని రికార్డు అద్భుతంగా ఉంది. అయితే.. ప్రస్తుతం విరాట్ కోహ్లీ టెస్ట్ క్రికెట్‌లో ఫామ్ లో లేక ఇబ్బంది పడుతున్న సంగతి తెలిసిందే.. ఈ క్రమంలో పెర్త్ లో రాణిస్తాడని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఇప్పటికే పరుగుల సునామీతో ఎన్నో రికార్డులు సొంతం చేసుకున్న విరాట్ కోహ్లీ.. అతనిని మరో రికార్డు ఊరిస్తోంది. బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో కేవలం 21 పరుగులు సాధిస్తే చరిత్రలో బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో 2,000 పరుగుల మైలురాయిని చేరుకున్న ఏడవ బ్యాటర్‌గా కోహ్లీ నిలుస్తాడు. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలలో ఇప్పటివరకు 24 టెస్టుల్లో 42 ఇన్నింగ్స్‌లలో 48.26 సగటుతో 1979 పరుగులు సాధించాడు. ఇందులో 8 సెంచరీలు, 5 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. కోహ్లీ కంటే ముందు నలుగురు భారతీయ క్రికెటర్లు మాత్రమే ఈ ఘనత సాధించారు.

Read Also: Putin To Visit India: భారత్‌‌లో పుతిన్ పర్యటన.. త్వరలో షెడ్యూల్ ఖరారు..

బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో అత్యధిక పరుగులు సాధించిన ఆటగాళ్లు వీళ్లే..
1. సచిన్ టెండూల్కర్ – 3,262 పరుగులు
2. రికీ పాంటింగ్ – 2,555 పరుగులు
3. వీవీఎస్ లక్ష్మణ్ – 2,434 పరుగులు
4. రాహుల్ ద్రావిడ్ – 2,143 పరుగులు
5. మైఖేల్ క్లార్క్ – 2,049 పరుగులు
6. చెతేశ్వర్ పుజారా – 2,033 పరుగులు
7. విరాట్ కోహ్లీ -1,979 పరుగులు చేశారు.