Virat Kohli: మరో రికార్డుకు దగ్గర్లో.. 21 పరుగులు సాధిస్తే చాలు
- నవంబర్ 22 నుంచి బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ ప్రారంభం
- పెర్త్‌లోని ఆప్టస్ స్టేడియం వేదికగా తొలి టెస్ట్ మ్యాచ్
- పెర్త్ మైదానంలో విరాట్ కోహ్లీ రికార్డు అద్భుతం
- ఇప్పటికే ఎన్నో రికార్డులు సొంతం చేసుకున్న విరాట్ కోహ్లీ
- కోహ్లీని ఊరిస్తున్న మరో రికార్డు
- బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో కేవలం 21 పరుగులు సాధిస్తే మరో మైలురాయి.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ నవంబర్ 22 (శుక్రవారం) నుంచి మొదలుకానుంది. పెర్త్‌లోని ఆప్టస్ స్టేడియం వేదికగా తొలి టెస్ట్ మ్యాచ్ జరగనుంది. అయితే.. టీమిండియా స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. పెర్త్ మైదానంలో అతని రికార్డు అద్భుతంగా ఉంది. అయితే.. ప్రస్తుతం విరాట్ కోహ్లీ టెస్ట్ క్రికెట్‌లో ఫామ్ లో లేక ఇబ్బంది పడుతున్న సంగతి తెలిసిందే.. ఈ క్రమంలో పెర్త్ లో రాణిస్తాడని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఇప్పటికే పరుగుల సునామీతో ఎన్నో రికార్డులు సొంతం చేసుకున్న విరాట్ కోహ్లీ.. అతనిని మరో రికార్డు ఊరిస్తోంది. బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో కేవలం 21 పరుగులు సాధిస్తే చరిత్రలో బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో 2,000 పరుగుల మైలురాయిని చేరుకున్న ఏడవ బ్యాటర్‌గా కోహ్లీ నిలుస్తాడు. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలలో ఇప్పటివరకు 24 టెస్టుల్లో 42 ఇన్నింగ్స్‌లలో 48.26 సగటుతో 1979 పరుగులు సాధించాడు. ఇందులో 8 సెంచరీలు, 5 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. కోహ్లీ కంటే ముందు నలుగురు భారతీయ క్రికెటర్లు మాత్రమే ఈ ఘనత సాధించారు.
Read Also: Putin To Visit India: భారత్‌లో పుతిన్ పర్యటన.. త్వరలో షెడ్యూల్ ఖరారు..
Also Read
- Pujara Playing XI: వెస్టిండీస్‌తో టీ20 సిరీస్.. వైభవ్ సూర్యవంశీకి దక్కని చోటు..
- AP Govt: రేపు ఏపీలో ‘అమరజీవి జలధార’కు శ్రీకారం.. 27.36 లక్షల కొత్త కుళాయి కనెక్షన్లు..
- VIVO Smart Phones: 6.59 అంగుళాల OLED డిస్ప్లే, 7000mAh బ్యాటరీ, 90W ఫాస్ట్ ఛార్జింగ్.. VIVO నుంచి రెండు స్మార్ట్ ఫోన్స్..
- Oppo F35 Series: 8000mAh బ్యాటరీ, 80W ఫాస్ట్ ఛార్జింగ్.. మార్కెట్లోకి Oppo నుంచి రెండు స్మార్ట్ ఫోన్స్..
బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో అత్యధిక పరుగులు సాధించిన ఆటగాళ్లు వీళ్లే..
1. సచిన్ టెండూల్కర్ – 3,262 పరుగులు
2. రికీ పాంటింగ్ – 2,555 పరుగులు
3. వీవీఎస్ లక్ష్మణ్ – 2,434 పరుగులు
4. రాహుల్ ద్రావిడ్ – 2,143 పరుగులు
5. మైఖేల్ క్లార్క్ – 2,049 పరుగులు
6. చెతేశ్వర్ పుజారా – 2,033 పరుగులు
7. విరాట్ కోహ్లీ -1,979 పరుగులు చేశారు.
తాజావార్తలు
-
Sardar 2 OTT: ఓటీటీలో ‘సర్దార్ 2’ ఊచకోత.. ప్రైమ్ వీడియోలో నంబర్ 1 ట్రెండింగ్!
-
Chanchalguda Jail : చంచల్‌గూడ జైలు సూపరింటెండెంట్‌పై ఆరోపణలు.. జైళ్ల శాఖ క్లారిటీ
-
Thackeray Brothers: ఠాక్రే బ్రదర్స్ ‘విరాట్ గర్జన’.. ఎన్నికల సంఘంపై విపక్షాల ఉమ్మడి పోరాటం!
-
Pujara Playing XI: వెస్టిండీస్‌తో టీ20 సిరీస్.. వైభవ్ సూర్యవంశీకి దక్కని చోటు..
-
LPG Subsidy: సిలిండర్ బుక్ చేసుకునేవారికి శుభవార్త.. రూ.300 సబ్సిడీకి కేంద్రం గ్రీన్ సిగ్నల్!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!