T20 World Cup: టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీలో ఇంగ్లాండ్‌తో సెమీ ఫైనల్ మ్యాచ్‌కు ముందు టీమిండియాను గాయాలు భయపెడుతున్నాయి. ప్రాక్టీస్ సెషన్‌లో భారత కీలక ఆటగాళ్లు గాయపడ్డారనే వార్తలు క్రికెట్ అభిమానులను కంగారుపెడుతున్నాయి. మంగళవారం ప్రాక్టీస్ సెషన్‌లో రోహిత్ గాయపడగా.. ఇవాళ విరాట్ కోహ్లీకి స్వల్ప గాయమైనట్లు తెలుస్తోంది. అడిలైడ్ చేరుకున్న భారత జట్టు ప్రాక్టీస్ సెషన్స్‌లో పాల్గొంటోంది. రేపు జరగనున్న సెమీస్ మ్యాచ్ దృష్టా సన్నద్ధమవుతున్నారు. మంగళవారం రోహిత్ గాయపడ్డాడనే వార్త నెట్టింట తెగ వైరల్ కాగా.. ఆ గాయం పెద్దదేమీ కాదని, అతను మ్యాచ్ ఆడతాడని భారత జట్టు వెల్లడించింది.
Rashmika Serious On Trollers: ట్రోలర్స్ పై ఓ రేంజ్ లో విరుచుకుపడ్డ రష్మిక
ఇదిలా ఉండగా.. బుధవారం ప్రాక్టీస్ సెషన్స్‌లో విరాట్ కోహ్లీ గాయపడ్డారనే వార్త అభిమానులను భయాందోళనకు గురి చేసింది. బుధవారం ప్రాక్టీస్‌లో భాగంగా హర్షల్ పటేల్ బౌలింగ్‌లో ప్రాక్టీస్ చేశాడు విరాట్ కోహ్లీ. ఈ సమయంలో ఓ బౌన్సర్ విరాట్ కోహ్లీ చేతికి బలంగా తాకిందని సమాచారం. నొప్పితో కాసేపు విలవిలలాడిన కోహ్లీ, ప్రాక్టీస్ సెషన్స్ నుంచి బయటికి వెళ్లాడనే వార్త అభిమానులను షాక్‌కి గురి చేసింది. దీంతో, కాసేపు ప్రాక్టీస్ ఆపేశాడు కింగ్ కోహ్లీ. అయితే, స్వల్ప గాయం కావడంతో.. ప్రస్తుతం కోహ్లీ ఫిట్‌గానే ఉన్నట్టు బీసీసీఐ అధికారులు తెలిపారు. దీంతో, టీమిండియాకు పెద్ద ప్రమాదం తప్పింది. ఈ వార్త విన్న అభిమానులు ఖుషీ అవుతున్నారు. ఇప్పటిదాగా జరిగిన మ్యాచుల్లో కోహ్లీ తన బ్యాట్‌తో అద్భుతాలే చేశాడు. కోహ్లీ సెమీస్‌లో ఆడడం చాలా అవసరం. 2012 టోర్నీలో చివరిసారిగా ఇంగ్లాండ్‌తో టీ20 వరల్డ్ కప్ మ్యాచ్ ఆడిన టీమిండియా, 10 ఏళ్ల తర్వాత మళ్లీ ఆ జట్టుతో ఆడనుంది. అయితే ఈ కీలక మ్యాచ్‌కి ముందు ప్రాక్టీస్ సెషన్స్‌లో భారత ప్లేయర్లు గాయపడుతున్నారనే వార్తలు అభిమానులను కలవర పెడుతున్నాయి.
