NTV Telugu Site icon

Virat Kohli: చరిత్ర సృష్టించిన కింగ్ కోహ్లీ.. 50 సెంచరీలతో సచిన్ రికార్డు బ్రేక్

Virat Kohli

Virat Kohli

Virat Kohli: క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్ రికార్డును బద్దలు కొట్టడం ద్వారా విరాట్ కోహ్లీ కొత్త చరిత్ర సృష్టించాడు. ప్రపంచ క్రికెట్‌ చరిత్రలో అరుదైన రికార్డును సాధించాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో 50 సెంచరీలతో సచిన్ రికార్డును బద్దలు కొట్టాడు. వన్డేల్లో అత్యధిక సెంచరీలు చేసిన బ్యాటర్‌గా విరాట్ నిలిచాడు. న్యూజిలాండ్ పై సెంచరీ తో వన్డేల్లో 50 సెంచరీలు పూర్తి చేసుకున్నాడు కోహ్లీ. 49 సెంచరీలు చేసిన సచిన్ రికార్డ్‌ని కోహ్లీ బ్రేక్ చేశాడు. ఈ వరల్డ్ కప్ టోర్నీ లో తన పుట్టిన రోజు నాడే సౌతాఫ్రికాపై సెంచరీ చేసి.. సచిన్ రికార్డ్ ని సమం చేసిన కోహ్లీ ఈ మ్యాచ్‌లో ఆ రికార్డును బ్రేక్‌ చేశాడు. వాంఖడే వేదికగా విరాట్ కోహ్లి హాఫ్ సెంచరీ పూర్తి చేయడంతో సచిన్‌ను అధిగమించాడు. ఈ జాబితాలో రోహిత్ శర్మ మూడో స్థానంలో ఉన్నాడు. వన్డే ఇంటర్నేషనల్ క్రికెట్‌లో రోహిత్ 31 సెంచరీలు చేశాడు.

రికార్డుల మోత
ఈ మ్యాచ్‌లో కోహ్లీ మరో అరుదైన ఘనత సాధించాడు. వన్డే వరల్డ్‌కప్‌ సింగిల్‌ ఎడిషన్‌లో అత్యధిక ఫిప్టి ప్లస్‌ స్కోర్లు సాధించిన ఆటగాడిగా విరాట్‌ చరిత్రకెక్కాడు. వన్డే ప్రపంచకప్‌-2023లో భాగంగా న్యూజిలాండ్‌తో సెమీఫైనల్లో సెంచరీతో చెలరేగిన విరాట్‌ కోహ్లి.. ఈ అరుదైన రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. ఈ ఏడాది మెగా టోర్నీలో కోహ్లి ఇప్పటివరకు 8 సార్లు ఏభై పైగా పరుగులు సాధించాడు. కాగా ఇంతకుముందు ఈ రికార్డు భారత క్రికెట్‌ దిగ్గజం సచిన్‌ టెండూల్కర్‌ పేరిట ఉండేది. వన్డే వరల్డ్‌కప్‌-2003లో సచిన్‌ 7 సార్లు ఫిప్టీ ప్లస్‌ స్కోర్లు నమోదు చేశాడు.

తాజా మ్యాచ్‌తో సచిన్‌ ఆల్‌టైమ్‌ రికార్డును బ్రేక్‌ చేశాడు. అంతేకాకుండా వన్డే వరల్డ్‌కప్‌ ఒకే ఎడిషన్‌లో అత్యధిక పరుగులు చేసిన సచిన్‌ రికార్డును కూడా కోహ్లి బ్రేక్‌ చేశాడు. విరాట్‌ ఈ టోర్నీలో ఇప్పటివరకు 674* పరుగులు చేశాడు. అంతకుముందు 2003 వరల్డ్‌కప్‌లో సచిన్‌ 673 పరుగులు సాధించాడు. అదే విధంగా అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక పరుగులు చేసిన మూడో ఆటగాడిగా కింగ్‌ కోహ్లీ నిలిచాడు. ఆస్ట్రేలియా దిగ్గజ కెప్టెన్‌ రిక్కీ పాంటింగ్‌(13,704) పేరిట ఉన్న రికార్డును కోహ్లీ బ్రేక్‌ చేశాడు. కోహ్లి ఇప్పటివరకు వన్డేల్లో 13,751 పరుగులు చేశాడు. వన్డే వరల్డ్‌కప్‌-2023లో టీమిండియా స్టార్‌ ఆటగాడు విరాట్‌ కోహ్లి రికార్డుల మోత మోగిస్తున్నాడు.

విరాట్ కోహ్లీ సెంచరీల పూర్తి జాబితాను ఇక్కడ చూడండి:-
1. 2009 శ్రీలంక 107 కోల్‌కతా
2. 2010 శ్రీలంక 102* ఢాకా
3. 2010 ఆస్ట్రేలియా 118 విశాఖపట్నం
4. 2010 న్యూజిలాండ్ 105 గౌహతి
5. 2011 బంగ్లాదేశ్ 100* ఢాకా
6. 2011 ఇంగ్లాండ్ 107 కార్డిఫ్
7. 2011 ఇంగ్లండ్ 112* ఢిల్లీ
8. 2011 వెస్టిండీస్ 117 విశాఖపట్నం
9. 2012 శ్రీలంక 133* హోబర్ట్
10. 2012 శ్రీలంక 108 ఢాకా
11. 2012 పాకిస్తాన్ 183 ఢాకా
12. 2012 శ్రీలంక 106 హంబన్‌తోట
13. 2012 శ్రీలంక 128 కొలంబో
14. 2013 వెస్టిండీస్ 102 పోర్ట్ ఆఫ్ స్పెయిన్
15. 2013 జింబాబ్వే 115 హరారే
16. 2013 ఆస్ట్రేలియా 100* జైపూర్
17. 2013 ఆస్ట్రేలియా 115* నాగ్‌పూర్
18. 2014 న్యూజిలాండ్ 123 నేపియర్
19. 2014 బంగ్లాదేశ్ 136 ఫతుల్లా
20. 2014 వెస్టిండీస్ 127 ధర్మశాల
21. 2014 శ్రీలంక 139* రాంచీ
22. 2015 పాకిస్తాన్ 107 అడిలైడ్
23. 2015 దక్షిణాఫ్రికా 138 చెన్నై
24. 2016 ఆస్ట్రేలియా 117 మెల్బోర్న్
25. 2016 ఆస్ట్రేలియా 106 కాన్బెర్రా
26. 2016 న్యూజిలాండ్ 154* మొహాలి
27. 2017 ఇంగ్లాండ్ 122 పూణే
28. 2017 వెస్టిండీస్ 111* కింగ్‌స్టన్
29. 2017 శ్రీలంక 131 కొలంబో
30. 2017 శ్రీలంక 110* కొలంబో
31. 2017 న్యూజిలాండ్ 121 ముంబై
32. 2017 న్యూజిలాండ్ 113 కాన్పూర్
33. 2018 దక్షిణాఫ్రికా 112 డర్బన్
34. 2018 దక్షిణాఫ్రికా 160* కేప్ టౌన్
35. 2018 దక్షిణాఫ్రికా 129* సెంచూరియన్
36. 2018 వెస్టిండీస్ 140 గౌహతి
37. 2018 వెస్టిండీస్ 157* విశాఖపట్నం
38. 2018 వెస్టిండీస్ 107 పూణే
39. 2019 ఆస్ట్రేలియా 104 అడిలైడ్
40. 2019 ఆస్ట్రేలియా 116 నాగ్‌పూర్
41. 2019 ఆస్ట్రేలియా 123 రాంచీ
42. 2019 వెస్టిండీస్ 120 పోర్ట్ ఆఫ్ స్పెయిన్
43. 2019 వెస్టిండీస్ 114* పోర్ట్ ఆఫ్ స్పెయిన్
44. 2022 బంగ్లాదేశ్ 113 చిట్టగాంగ్
45. 2022 శ్రీలంక 113 గౌహతి
46. ​​2022 శ్రీలంక 166* తిరువనంతపురం
47. 2023 పాకిస్తాన్ 122* కొలంబో
48. 2023 బంగ్లాదేశ్ 103* పూణే
49. 2023 దక్షిణాఫ్రికా 101* కోల్‌కతా
50. 2023 న్యూజిలాండ్ 106* వాంఖడే

Show comments