Virat Kohli: నీ రేంజ్ ఏంటి.. నువ్వు చేసే పనులేంటి కోహ్లీ.! ఫన్నీ యాక్షన్స్ వైరల్..

Virat Kohli (1)

Virat Kohli (1)

Virat Kohli: ఐపీఎల్ 2026 క్వాలిఫయర్-1లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, గుజరాత్ టైటాన్స్ మధ్య జరిగిన హై వోల్టేజ్ పోరులో గుజరాత్ టైటాన్స్‌ను 92 పరుగుల భారీ తేడాతో ఓడించి ఐపీఎల్ 2026 ఫైనల్‌ లో అడుగుపెట్టింది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB). అయితే మ్యాచ్ ప్రారంభానికి ముందే ఆర్‌సీబీ స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ మాత్రం తన సరదా చేష్టలతో అందరి దృష్టిని మరోసారి వార్తల్లో నిలిచాడు.

మ్యాచ్‌కు ముందు గుజరాత్ టైటాన్స్ ఆటగాళ్లు బౌండరీ లైన్ దగ్గర అధికారిక జట్టు ఫోటోషూట్‌, మీడియా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఆ సమయంలో అప్పటికే మ్యాచ్‌ కు సిద్ధమై ప్యాడ్లు కట్టుకున్న కోహ్లీ, బ్యాక్‌ గ్రౌండ్‌లో నిలబడి గుజరాత్ ఆటగాళ్ల వైపు ఫన్నీ ఎక్స్‌ప్రెషన్స్ ఇస్తూ సరదాగా కనిపించాడు. కోహ్లీ చేసిన ఆ సరదా చేష్టలను కెమెరాలు వెంటనే క్యాచ్ చేయగా.. స్టేడియంలో ఉన్న అభిమానులు తెగ ఎంజాయ్ చేసారు. అంతేకాకుండా ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అయితే ఈ వీడియోపై మిశ్రమ స్పందన వెల్లడవుతుంది.

కొందరు అభిమానులు “ఇదే అసలైన విరాట్ ఎంటర్టైన్మెంట్” అంటూ కామెంట్లు చేస్తుండగా.. మరికొందరు మాత్రం విభిన్నంగా “నీ రేంజ్ ఏంటి.. నువ్వు చేసే పనులేంటి కోహ్లీ” అంటూ మండి పడుతున్నారు. నాకౌట్ మ్యాచ్ ఒత్తిడి ఉన్నప్పటికీ కోహ్లీ చాలా రిలాక్స్‌డ్‌ గా కనిపించాడు. మ్యాచ్‌కు ముందు టెన్షన్ వాతావరణాన్ని తన సరదా చేష్టలతో కాస్త లైట్ చేశాడు. మైదానంలో ఎంత అగ్రెసివ్‌గా ఉంటాడో, బయట అంతే ఉత్సాహంగా ఉంటాడని మరోసారి నిరూపించాడు. ధర్మశాలలో జరిగిన ఈ మ్యాచ్‌లో కోహ్లీ 43 పరుగులు చేసి కీలక పాత్ర పోషించి.. వరుసగా 4వ సీజన్‌లో 600+ పరుగులు పూర్తి చేశాడు.