Virat Kohli: ఆర్సీబీ జట్టు ఐపీఎల్ 2025 ట్రోఫీని గెలుచుకున్న సమయంలో, అందరికన్నా ఎమోషనల్‌గా స్పందించిన వ్యక్తి విరాట్ కోహ్లీ. ఈ గెలుపు 18 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణకు ముగింపు పలికింది. ఈ టైటిల్ అతడి జీవితంలో ఎప్పటికీ గుర్తుండిపోయే క్షణంగా నిలిచింది. కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకున్నప్పటికీ, కోహ్లీ ఆర్సీబీకి తన సేవలను అంకితం చేశాడు. ప్రతి మ్యాచ్ లో అత్యుత్తమ ప్రదర్శన ఇచ్చి జట్టును ప్రేరేపించాడు.
ఎంతోమంది లెజెండ్స్ ఆడిన ఈ జట్టుకు టోఫీ అందించడం యువ క్రికెటర్ల ద్వారా సాధ్యమైంది. కానీ, ఆ ట్రోఫీని ఎత్తి పట్టుకున్నప్పుడు కోహ్లీ కళ్లలలో వచ్చిన ఆనందానికి ఆర్సీబి అభిమానులు ఉప్పొంగిపోయారు. విజయాన్ని సెలబ్రేట్ చేసుకోవడంలో అతడి ఆనందం ఉక్కిరిబిక్కిరయ్యే భావోద్వేగానికి గురిచేసింది. అతడి దీర్ఘకాలం పాటు అందించిన కృషికి, నిబద్ధతకు ఇదే అసలైన ఫలితం. ఆర్సీబీ విజయ గాథలో విరాట్ పేరు చిరస్థాయిగా నిలవనుంది. ఇకపోతే ఏ విజయాన్ని అందుకున్న తర్వాత ఆయన సోషల్ మీడియా వేదికగా కూడా తన భావాలను వ్యక్త పరిచాడు.
Read Also: Vaibhav Suryavanshi: అరెరే పెద్ద సమస్యే వచ్చిందే.. కారు గెలిచాడు కానీ.. మరో నాలుగేళ్లు..?
ఇందులో భాగంగా ఆయన.. ఈ జట్టే నా కలను నిజం చేసింది. ఈ సీజన్‌ను నేను జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేను. గత రెండున్నర నెలలు మనమందరం చేసిన ప్రయాణం అద్భుతం. ఈ విజయాన్ని RCB అభిమానులకు అంకితంగా ఇస్తున్నాం. మనం ఓడినప్పుడు కూడా మన పక్కన నిలిచిన వారికీ, ప్రతి సంవత్సరం తలెత్తిన బాధ, నిరాశలన్నిటికీ ఇది సమాధానం. ఈ జెర్సీకి పేరుకుపోయిన ప్రతి అంగుళపు శ్రమకు ఇదే ఫలితం అంటూ కాస్త ఎమోషనల్ గా రాసుకొచ్చారు. అలాగే ఐపీఎల్ ట్రోఫీ విషయంలో మాట్లాడుతూ… నన్ను 18 ఏళ్లు ఆగేలా చేసావు.. కానీ, నిన్ను ఎత్తి పట్టుకుని ఉత్సవంగా మార్చిన ఈ క్షణం… ఎదురుచూపులన్నింటికీ న్యాయం చేసింది. ఈ విజయం కోసం ఎదురు చూసిన ప్రతి క్షణం విలువైనదే అంటూ రాసుకొచ్చారు.
