Delhi vs Andhra: విజయ్ హజారే ట్రోఫీ (Vijay Hazare Trophy)లో ఢిల్లీ జట్టు ఆంధ్రపై భారీ విజయం సాధించింది. బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ మైదానంలో జరిగిన గ్రూప్ D మ్యాచ్లో ఢిల్లీ 4 వికెట్ల తేడాతో గెలిచింది. 74 బంతులు మిగిలి ఉండగానే లక్ష్యాన్ని ఛేదించిన ఢిల్లీ టోర్నీలో మంచి ఆరంభాన్ని అందుకుంది. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్న ఆంధ్ర జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 298 పరుగులు చేసింది.
Payal Rajput: శివాజీ వ్యాఖ్యలపై ‘పాయల్ రాజ్‌పుత్’ ఫైర్.. ఆ వ్యాఖ్యలు అసహనం తెప్పించాయంటూ..!
ఆంధ్ర జట్టు ఇన్నింగ్స్ లో రికీ భుయ్ 105 బంతుల్లో (11 ఫోర్లు, 7 సిక్సర్ల) 122 పరుగులతో ధనాధన్ సెంచరీతో జట్టును ఆదుకున్నాడు. మరోవైపు కెప్టెన్ నితీశ్ కుమార్ రెడ్డి (23), హేమంత్ రెడ్డి (27), ప్రసాద్ (28) సహకారంతో ఆంధ్ర భారీ స్కోరు సాధ్యమైంది. ఢిల్లీ బౌలర్లలో సిమర్‌జీత్ సింగ్ 10 ఓవర్లలో 54 పరుగులిచ్చి 5 వికెట్లు తీసి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు. అంతికి తోడుగా ప్రిన్స్ యాదవ్ 3 వికెట్లు తీసి సహకారం అందించాడు.
299 పరుగుల లక్ష్య ఛేదనలో ఢిల్లీ ఆరంభం సరిగా అందుకోలేదు. రెండో బంతికే అర్పిట్ రాణా (0) ఔట్ కాగా.. మరో ఓపెనర్ ప్రియాంశ్ ఆర్య 44 బంతుల్లో 7 ఫోర్లు, 5 సిక్సర్లతో 74 పరుగులతో ధనాధన్ బ్యాటింగ్‌తో జట్టును ఆదుకున్నాడు. అతినికి తోడుగా విరాట్ కోహ్లీ చక్కటి సహకారాన్ని అందించాడు. ప్రియాంశ్ ఆర్య అవుట్ అయిన తర్వాత కోహ్లీ 101 బంతుల్లో 14 ఫోర్లు, 3 సిక్సర్లతో 131 పరుగులు చేసి ఢిల్లీ విజయాన్ని సునాయాసం చేశాడు. ఈ నేపథ్యంలోనే నితీశ్ రాణా 55 బంతుల్లో 9 ఫోర్లు, 2 సిక్సర్లతో 77 పరుగులతో కలిసి మూడో వికెట్‌కు 160 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు.
Vijay Hazare Trophy: సెంచరీతో రోహిత్ శర్మ ఊచకోత.. ముంబై భారీ విజయం..!
ఇక 32.5 ఓవర్లలోనే 274 స్కోరు వద్ద కోహ్లీ అవుట్ అయ్యాడు. ఆ తర్వాత నితీశ్ రాణా కూడా ఔట్ కావడంతో ఢిల్లీ పై కాస్త ఒత్తిడి పెరిగింది. ఆ తర్వాత రిషభ్ పంత్ (5), అయూష్ బడోనీ (1) వరుసగా ఔట్ అయ్యారు. ఇక చివరకు 37.4 ఓవర్లలో ఢిల్లీ 300/6తో లక్ష్యాన్ని అధిగమించింది. చివరలో హర్ష్ త్యాగి (4*), నవదీప్ సైనీ (5*) అజేయంగా నిలిచారు. ఆంధ్ర బౌలర్లలో పీవీఎస్‌ఎన్ రాజు, హేమంత్ రెడ్డి 2 వికెట్లు తీశారు. ఈ మ్యాచ్ లో విరాట్ కోహ్లీ సెంచరీతో పాటు లిస్ట్-ఏలో 16,000 పరుగుల మైలురాయిని కూడా అధిగమించడం విశేషం.
