గురువారం నాడు హైదరాబాద్ ఉప్పల్ స్టేడియం వేదికగా ఐపిఎల్ 2024 సీజన్ లో భాగంగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, సన్ రైజర్స్ హైదరాబాద్ జట్లు తలపడుతున్నాయి. ఇందులో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్లను కోల్పోయి 206 పరుగులను రాబట్టింది. ఇక రాయల్ చాలెంజ్ బెంగళూరు జట్టులో విరాట్ కోహ్లీ, రజాక్ పటిదార్ లు హాఫ్ సెంచరీలు చేయడంతో సన్ రైజర్స్ జట్టుకి 207 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించారు.
Also Read: SRH vs RCB: భారీ స్కోరు చేసిన ఆర్సీబీ.. సన్ రైజర్స్ టార్గెట్ ఎంతంటే..?
ఇక రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు స్టార్ బ్యాట్స్మెన్ విరాట్ కోహ్లీ 43 బంతులలో 51 పరుగులను చేయటంతో తాజాగా మరో రికార్డును తన పేరిట లిఖించాడు. ఇక ఈ రికార్డు సంగతి చూస్తే.. ఐపీఎల్ చరిత్రలో 10 సీజన్లలో 400కు పైగా పరుగులు చేసిన ఏకైక క్రికెటర్ గా కోహ్లీ రికార్డును క్రియేట్ చేశాడు.
Also Read: Tech Mahindra: త్రైమాసిక ఫలితాలను ప్రకటించిన టెక్ మహీంద్రా.. ఒక్కో షేరుపై రూ.28 డివిడెండ్..
ఐపీఎల్ 2024 సీజన్లో భాగంగా 400 రన్స్ ను పూర్తి చేసిన విరాట్ ఈ అరుదైన ఘనతను తన ఖాతాలో వేసుకున్నాడు. ఇప్పటివరకు 2011, 2013, 2015, 2016, 2018, 2019, 2020, 2021, 2023, 2024 సీజన్లలో విరాట్ కోహ్లీ 400 పైగా పరుగులు సాధించి ఈ రికార్డును క్రియేట్ చేశాడు. ఇక ప్రస్తుత సీజన్ లో విరాట్ కోహ్లీ 9 మ్యాచ్ లలో బ్యాటింగ్ తర్వాత 430 పరుగులను సాధించాడు. ఈ మ్యాచ్ లో మరో రికార్డ్ పరంగా చూస్తే.. ఓపెనర్ గా విరాట్ కోహ్లీ 4,000 పరుగుల మైలును అందుకున్నాడు.