NTV Telugu Site icon

Virat Kohli: విరాట్ కోహ్లీని మళ్లీ టీమిండియాకు కెప్టెన్‌గా చేయొచ్చుగా..

Msk Prasad

Msk Prasad

ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ 2023 ఫైనల్ మ్యాచ్ ముగిసిన తర్వాత భారత జట్టుకు కొత్త టెస్ట్ సారథిని నియమించబోతున్నట్లు ప్రచారం జరిగింది. ఈ కెప్టెన్సీ లిస్టులో రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, శుభ్ మన్ గిల్ పేర్లు వినిపించాయి. ఇలా చాలామంది పేర్లు, టీమిండియా ఫ్యూచర్ టెస్టు కెప్టెన్లుగా వినిపించియి. అయితే రోహిత్ శర్మను టెస్టు కెప్టెన్‌గా కొనసాగించిన సెలక్షన్ కమిటీ అతనికి డిప్యూటీగా అజింకా రహానేని నియమించింది. ఈ నిర్ణయంపై టీమిండియా మాజీ చీఫ్ సెలక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ ఆశ్చర్యం వ్యక్తం చేశాడు.

Read Also: High Court: కోర్టు ధిక్కరణ కేసు.. ఐఏఎస్‌ అధికారికి జైలు శిక్ష, జరిమానా

రోహిత్ శర్మను తిరిగి టీమిండియా కెప్టెన్‌గా కొనసాగించడం కరెక్టా? కాదా? అంటే నేను దానికి ఆన్సర్ ఇవ్వలేను.. ఈ వయసులో రోహిత్ కు మూడు ఫార్మాట్లో సారథ్య బాధ్యతలు ఇవ్వడం పెద్ద భారమే అని ఎమ్మేస్కే ప్రసాద్ తెలిపారు. అందుకే టీ20ల్లో హార్ధిక్ పాండ్యాని టీమిండిమా భవిష్యత్ కెప్టెన్‌గా కొనసాగిస్తున్నట్టు ఉన్నారు.. సెలక్టర్ల మైండ్‌సెట్ ఎలా ఉంటుందో చెప్పడం కష్టం.. 2025 ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్ వరకూ ఆలోచిస్తే, రోహిత్‌ శర్మని టెస్టు కెప్టెన్‌గా కొనసాగించడం మాత్రం కరెక్ట్ కాదు.. అయినా టీమిండియాకి కొత్త కెప్టెన్‌ని వెతకాల్సిన అవసరం ఏముంది అని అతడు ప్రశ్నించాడు.

Read Also: Foxconn-Vedanta Deal: వేదాంతకు షాక్ ఇచ్చిన ఫాక్స్‌కాన్.. కారణం చెప్పకుండానే డీల్‌ బ్రేక్

విరాట్ కోహ్లీ ఎలాగు ఉన్నాడు.. అజింకా రహానేకి తిరిగి టెస్టు వైస్ కెప్టెన్సీ ఇచ్చినప్పుడు, విరాట్ కోహ్లీని తిరిగి టెస్టు కెప్టెన్‌గా చేయొచ్చుగా అని టీమిండియా మాజీ సెలక్టర్ ఎమ్మేస్కే ప్రసాద్ అన్నారు. అయితే కెప్టెన్సీ విషయంలో ఇప్పుడు విరాట్ కోహ్లీ ఆలోచన ఎలా ఉందనేది అవసరం.. కోహ్లీ తిరిగి టెస్టు కెప్టెన్సీ బాధ్యతలు తీసుకోవడానికి సిద్దంగా ఉంటే, సెలక్టర్లు అతన్ని కచ్చితంగా పరిగణనలోకి తీసుకోవాలి అని అతను చెప్పారు. ఎందుకంటే విరాట్ కోహ్లీ మరో మూడు, నాలుగేళ్లు టెస్టుల్లో కొనసాగగలడు అంటూ ఎమ్మెస్కే ప్రసాద్ కామెంట్స్ చేశాడు.

Show comments