NTV Telugu Site icon

Virat Kohli Hug: లక్కీ గర్ల్.. దగ్గరికి వెళ్లి అమ్మాయికి హగ్ ఇచ్చిన కోహ్లీ (వీడియో)..

Kohli Hug

Kohli Hug

ప్రస్తుతం భారత్-ఇంగ్లాండ్‌తో మూడు వన్డేలు ఆడుతున్న విషయం తెలిసిందే. ఈ సిరీస్‌లో రెండు మ్యాచ్‌లు గెలిచి ఆధిక్యంలో ఉన్న భారత్.. మూడో మ్యాచ్ కూడా గెలిచి క్లీన్ స్వీప్ చేయాలని భావిస్తోంది. అందులో భాగంగానే మూడవ మ్యాచ్ అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో జరగనుంది. అయితే.. ఈ మ్యాచ్‌కి ముందు టీమిండియా భువనేశ్వర్ విమానాశ్రయానికి చేరుకుంది. అహ్మదాబాద్‌కు రావడానికి ఎయిర్ పోర్టుకు వచ్చిన సమయంలో.. విరాట్ కోహ్లీ చేసిన పని అందరినీ ఆశ్చర్యపరిచింది.

టీమిండియా ఆటగాళ్లను చూసేందుకు అభిమానులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. అయితే.. క్రికెటర్స్ వస్తున్న సమయంలో అభిమానులు కేకలు వస్తూ కనిపించారు. అయితే.. ఎయిర్ పోర్ట్ మొత్తం భద్రతా వ్యవస్థ పర్యవేక్షణలో ఉన్నప్పటికీ, కోహ్లీ ఒక అమ్మాయి దగ్గరికి వెళ్లి కౌగిలించుకున్నాడు. దీంతో.. అక్కడ ఉన్న వారంతా ఆశ్చర్యానికి గురయ్యారు. కోహ్లీ చేసిన ఈ చర్యను చూసిన వారు.. ఈ సంఘటనను తమ సెల్‌ఫోన్లలో రికార్డ్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Read Also: MP Midhun Reddy: రాజకీయాలు పక్కన పెట్టి రాష్ట్ర సమస్యల పరిష్కారం కోసం వారితో కలిసి ముందుకెళ్తాం..

ఈ వీడియో చూసిన నెటిజన్లు.. కోహ్లీ ఈ అమ్మాయిని ఎందుకు కౌగిలించాడో అని సోషల్ మీడియాలో చర్చ మొదలైంది. ఈ అమ్మాయి ఎవరు? ఆమెను ఎందుకు కౌగిలించుకున్నాడు..? ఈ ప్రశ్నలు నెట్టింట చర్చనీయాంశంగా మారాయి. కొంతమంది అభిమానులు.. ఈ అమ్మాయి కోహ్లీకి అత్యంత దగ్గరగా ఉన్న బంధువేమో అని అంటున్నారు. అయితే, దీనికి సంబంధించిన అసలు విషయం బయటకు రాలేదు. ఒక విషయం మాత్రం ఖచ్చితంగా చెప్పవచ్చు. కోహ్లీకి ఈ అమ్మాయి బాగా తెలుసు.. అందుకే అతను తన భద్రత గురించి ఆలోచించకుండా ఆమె దగ్గరకు వెళ్లి కౌగిలించుకున్నాడు. ఆమె.. సాధారణ అభిమాని కాదు, ఎవరో ప్రత్యేకమైన వ్యక్తి. కోహ్లీకి ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మంది అభిమానులు ఉన్న సంగతి తెలిసిందే.. ఆయన ఆట కోసం ఎక్కడికైనా వెళ్లి చూసే ఫ్యాన్స్ కోట్లలో ఉన్నారు.

ఫామ్ పై దృష్టి:
కోహ్లీ ఫామ్ పై బాగా దృష్టి సారించాడు. ఇటీవల జరిగిన నాగ్‌పూర్ వన్డేలో అతను గాయంతో ఆడలేదు. అతను మోకాలిలో వాపు కారణంగా ఆ మ్యాచ్‌కు దూరంగా ఉన్నాడు. అయితే.. కటక్ వన్డేలో ఆడినప్పటికీ, అభిమానులను నిరాశపరిచాడు. అయితే.. అహ్మదాబాద్‌లో జరగనున్న మూడో వన్డే మ్యాచ్‌లో కోహ్లీ బాగా ఆడుతాడని అభిమానులు భావిస్తున్నారు. ఈ మ్యాచ్ లో కోహ్లీ తిరిగి ఫామ్ లోకి వస్తాడని అనుకుంటున్నారు. ఈ నెలలో భారత్ ఛాంపియన్స్ ట్రోఫీలో పాల్గొననుంది. ఈ మెగా టోర్నమెంట్‌లో కోహ్లీకి పటిష్టమైన ఫామ్‌లో ఉండటం చాలా ముఖ్యం. టీమ్ ఇండియాకు విజయాన్ని అందించాలంటే.. కోహ్లీ బ్యాటింగ్ అనేది ఒక కీలక అంశం. అంతేకాక.. కోహ్లీకి ఈ టోర్నమెంట్ చాలా ముఖ్యం. ఎందుకంటే ఛాంపియన్స్ ట్రోఫీలో పరుగులు చేయకపోతే అతని కెరీర్ ప్రమాదంలో పడే అవకాశం ఉంది.