NTV Telugu Site icon

Virat Kohli Birthday: విరాట్ కోహ్లీ అరుదైన ఘనతలు ఇవే!

Virat Kohli Test

Virat Kohli Test

అండ‌ర్ -19 ప్రపంచ క‌ప్ హీరోగా జ‌ట్టులోకి వ‌చ్చి.. విలువైన ఆట‌గాడిగా, స‌మ‌ర్ధుడైన‌ నాయ‌కుడిగా భారత జ‌ట్టుపై త‌న ముద్ర వేశాడు. అంతేకాదు ప్ర‌పంచ క్రికెట్‌లో ర‌న్ మెషీన్‌గా.. రికార్డులు బ‌ద్ధ‌లు కొట్టే రారాజుగా.. క్రికెట్ ఛేజ్ మాస్ట‌ర్‌గా గుర్తింపు పొందాడు. త‌న క్లాస్ ఇన్నింగ్స్‌ల‌తో అభిమానుల గుండెల్లో చెల‌రేగ‌ని స్థానం సంపాధించిన భారత స్టార్‌ క్రికెటర్ విరాట్ కోహ్లీ పుట్టిన రోజు నేడు. నేటితో కోహ్లీ 36వ ఏడాదిలోకి అడుగుపెట్టాడు. ప్రపంచవ్యాప్తంగా అభిమానులు కోహ్లీ పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నారు. పుట్టిన రోజు సందర్భంగా విరాట్ ఘనతలు ఏంటో ఓసారి చూద్దాం.

అరుదైన ఘనతలు:

# వన్డేల్లో అత్యధిక సెంచరీలు (50) సాధించిన బ్యాటర్‌గా విరాట్ కోహ్లీ ఉన్నాడు. క్రికెట్ దిగ్గజం సచిన్‌ టెండూల్కర్ (49)ను అధిగమించి మరీ అగ్రస్థానంకి కొనసాగుతున్నాడు.

# అత్యంత వేగంగా వన్డేల్లో 8 వేలు (175 ఇన్నింగ్స్‌లు), 9 వేలు (194 ఇన్నింగ్స్‌లు), 10 వేలు (205 ఇన్నింగ్స్‌లు), 11 వేలు (222 ఇన్నింగ్స్‌లు), 12 వేలు (242 ఇన్నింగ్స్‌లు), 13 వేలు (267 ఇన్నింగ్స్‌లు) పరుగులను సాధించాడు.

# వన్డే ప్రపంచకప్ (2011), ఛాంపియన్స్‌ ట్రోఫీ (2013), టీ20 ప్రపంచకప్‌ (2024)ను గెలిచిన జట్లలో విరాట్ కోహ్లీ సభ్యుడు.

# అంత‌ర్జాతీయ క్రికెట్‌లో 27 వేల ప‌రుగుల మైలురాయికి విరాట్ చేరుకున్నాడు. అత్యంత వేగంగా ఈ క్ల‌బ్‌లో చేరిన ఆట‌గాడిగా చ‌రిత్ర సృష్టించాడు.

# వన్డే ప్రపంచకప్‌లో అత్యధిక స్కోరు చేసిన రెండో బ్యాటర్ విరాట్ కోహ్లీ (1,795)గా కోహ్లీ ఉన్నాడు. 37 మ్యాచుల్లో 5 సెంచరీలు, 12 హాఫ్‌ సెంచరీలు సాధించాడు.

# టీ20 సిరీసుల్లో ఏడు ‘ప్లేయర్‌ ఆఫ్‌ ది సిరీస్‌’లను నెగ్గిన ఏకైక క్రికెటర్‌ విరాట్ కోహ్లీ.

# టీ20ల్లో రోహిత్ శర్మ (4,231) తర్వాత అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్ విరాట్ కోహ్లీ (4,188). అయితే రోహిత్ కంటే తక్కువ ఇన్నింగ్స్‌ల్లోనే సాధించడం గమనార్హం.

Also Read: Virat Kohli Birthday: విరాట్ కోహ్లీపై అభిమానం.. సాగర తీరంలో సైకత శిల్పం!

# కెప్టెన్‌గా భారత జట్టుకు అత్యధిక మ్యాచుల్లో విజయాలు అందించిన మూడో సారథి కోహ్లీ. మూడు ఫార్మాట్లలో కలిపి 213 మ్యాచుల్లో 135 విజయాలు అందించాడు.

# టెస్టుల్లో ఇంగ్లండ్‌, ఆస్ట్రేలియా గడ్డపై భారత్‌ను గెలిపించిన సారథిగా కోహ్లీ అరుదైన ఘనత సాధించాడు.

# సుదీర్ఘ ఫార్మాట్‌లో 9వేల ప‌రుగుల క్ల‌బ్‌లో విరాట్ ఇటీవలే చేరాడు.

# అర్జున, ప‌ద్మ‌శ్రీ, మేజ‌ర్ ధ్యాన్ చంద్ ఖేల్ ర‌త్న అవార్డులు విరాట్ సొంతం.

Show comments