Site icon NTV Telugu

Virat Kohli Birthday: విరాట్ కోహ్లీపై అభిమానం.. సాగర తీరంలో సైకత శిల్పం!

Virat Kohli

Virat Kohli

నేడు టీమిండియా స్టార్‌ క్రికెటర్ విరాట్ కోహ్లీ పుట్టినరోజు. నేటితో కింగ్ కోహ్లీ 36వ ఏడాదిలోకి అడుగుపెట్టాడు. భారత్ మాత్రమే కాదు ప్రపంచవ్యాప్తంగా అభిమానులు విరాట్ పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు. సోషల్ మీడియాలో శుభాకాంక్షలు వెల్లువెత్తున్నాయి. కోహ్లీపై అభిమానంతో ప్రముఖ సైకత శిల్పి సుదర్శన్ పట్నాయక్ అద్భుత ఆర్ట్‌ను రూపొందించారు. ఒడిశాలోని పూరీ బీచ్‌లో 5 అడుగుల సైకత శిల్పాన్ని రూపొందించారు. దాదాపు నాలుగు టన్నుల ఇసుకతో తయారు చేసినట్లు సుదర్శన్ తెలిపారు.

Also Read: Gold Price Today: మగువలకు శుభవార్త.. తగ్గిన బంగారం ధరలు!

సుదర్శన్ పట్నాయక్ తన సాండ్ ఆర్ట్‌ ఇనిస్టిట్యూట్ విద్యార్థులతో కలిసి ఈ ఆర్ట్‌ను రూపొందించారు. ‘నేడు విరాట్ కోహ్లీ 36వ పుట్టినరోజు. విరాట్ కోసం ప్రత్యేకంగా సైకత శిల్పం తయారు చేశాం. ఆర్టిస్ట్‌గా కోహ్లీ పుట్టినరోజు వేడుకలను ఇలా చేసుకున్నాం. చాలా ఆనందంగా ఉంది’ అని సుదర్శన్ తెలిపారు. సాగర తీరంలోని ఈ సైకత శిల్పం సోషల్ మీడియాలో వైరల్ అయింది. సుదర్శన్‌పై అందరూ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. గత ఒకటిన్నర దశాబ్దాలుగా విరాట్ తన బ్యాటింగ్‌తో ప్రపంచవ్యాప్తంగా ఎందరో అబిమానులను సంపాదించాడు. అంతర్జాతీయ కెరీర్‌లో విరాట్ ఇప్పటివరకు 118 టెస్టుల్లో, 295 వన్డేల్లో, 125 టీ20 మ్యాచ్‌ల్లో భారత్ జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు.

Exit mobile version