Kohli- Anushka Breakup Story: నేడు కింగ్ కోహ్లీ పుట్టిన రోజు.. విరాట్ నవంబర్ 5, 1988న దేశ రాజధాని ఢిల్లీలో జన్మించారు. బర్త్‌డే బాయ్ విరాట్ కోహ్లీకి ప్రపంచవ్యాప్తంగా అభిమానులు, క్రికెటర్ల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. విరాట్ కోహ్లీ 37 ఏళ్లు పూర్తి చేసుకున్నాడు. అభిమాన క్రికెటర్ పుట్టినరోజు వేడుకలకు ఫ్యాన్స్ రెడీ అవుతున్నారు. విరాట్ పుట్టిన రోజు సందర్భంగా ఓ ఆసక్తికర విషయం గురించి తెలుసుకుందాం..
టీమిండియా టాప్ బ్యాటర్ విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ 2017, డిసెంబర్ 11వ తేదీన మ్యారేజ్ ద్వారా ఒక్కటయ్యారు. ఇటలీలో డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకున్నారు. విరుష్క పెళ్లి తర్వాతే డెస్టినేషన్ వెడ్డింగ్ కాన్సెప్ట్ బాగా పాపులర్ అయింది. వీళ్ల మ్యారేజ్ కాస్ట్యూమ్స్, స్టైలింగ్ కూడా అప్పట్లో క్రేజీగా మారాయి. అంతగా హల్‌చల్ చేసిన ఈ స్టార్ కపుల్.. గతంలో విడిపోవడానికి సిద్ధమయ్యారనే విషయం మీకు తెలుసా?
అనుష్క, విరాట్ బంధంలో అనేక ఇబ్బందులను ఎదుర్కొన్నారు. కానీ నేడు వాళ్ల బంధం విడదీయరానిదిగా మారింది. పెళ్లికి ముందు ఇంతో ప్రేమించుకున్న ఇద్దరూ 2016 ఏడాదిలో విడిపోయారని వార్తలు వ్యాపించాయి. కానీ.. విడిపోవడానికి గల కారణం బయటకు రాలేదు. కాగా.. కొంతకాలం తర్వాత ఈ జంట తిరిగి కలుసుకున్నారు. మొదట్లో అనుష్క శర్మ సోదరుడు కర్ణేష్ శర్మ ఇద్దరినీ కలిపేందుకు ట్రై చేశాడని వార్తలు వచ్చాయి. అయితే, “సుల్తాన్” చిత్రంలో అనుష్క సహనటుడు సల్మాన్ ఖాన్, ఈ ప్రేమ జంటను కలపడంలో ప్రధాన పాత్ర పోషించాడని వెల్లడైంది.
