Virat Kohli Angry: కోహ్లీ రౌద్రరూపం.. హాఫ్ సెంచరీ చేసిన తర్వాత హెల్మెట్, గ్లౌజులు విసిరేసిన కింగ్.. వాంఖడేలో ఏం జరిగింది?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Virat Kohli Angry: ఐపీఎల్ 2026లో భాగంగా ఆదివారం ముంబైలోని వాంఖడే స్టేడియంలో జరిగిన ఆర్సీబీ, ముంబై ఇండియన్స్ పోరు మైదానంలోనే కాక సోషల్ మీడియాలోనూ సెన్సేషన్ సృష్టిస్తోంది. ముఖ్యంగా విరాట్ కోహ్లీకి సంబంధించిన ఒక వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. హాఫ్ సెంచరీ చేసిన ఆనందం కంటే, అవుటైన తీరుపై కోహ్లీ ప్రదర్శించిన ఆగ్రహం ఇప్పుడు చర్చనీయాంశమైంది. ఐపీఎల్ 19వ సీజన్లో భాగంగా ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ తీవ్ర అసహనానికి గురయ్యాడు. హాఫ్ సెంచరీ పూర్తి చేసిన తర్వాతి బంతికే అనూహ్య రీతిలో అవుటవడంతో, మైదానంలోనే తన కోపాన్ని ప్రదర్శించాడు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.
Also Read
- Ceiling Fan Speed: సీలింగ్ ఫ్యాన్ స్పీడ్ తగ్గిందా.? కారణం ఇదే కావచ్చు.! కొత్తది కొనేముందు ఈ విషయాలు తప్పక చెక్ చేయండి.!
- WWDCలో పొరపాటున 'ఫోల్డబుల్ ఐఫోన్' వివరాలు లీక్ చేసుకున్న Apple.!
- Delhi: డబుల్ ధమాకా.. 12 ఏళ్ల మోడీ పాలన పూర్తి.! కేంద్ర క్యాబినెట్, ఎన్డీఏ కీలక భేటీలు.!
- BAN vs AUS: ఆసీస్‌పై పంజా విసిరిన బంగ్లాదేశ్.! 86 పరుగుల తేడాతో భారీ విజయం..
అసలేం జరిగిందంటే..
ఈ మ్యాచ్‌లో కోహ్లీ 38 బంతుల్లో 50 పరుగులు (5 ఫోర్లు, 1 సిక్సర్) చేశాడు. 37 బంతుల్లో నిలకడగా ఆడి ఫిఫ్టీ పూర్తి చేసుకున్న కింగ్, ఆ తర్వాతి బంతిని భారీ షాట్‌గా మలచాలని ప్రయత్నించాడు. హార్దిక్ పాండ్యా వేసిన ఫుల్ టాస్ బంతిని హిట్ చేసే క్రమంలో కోహ్లీ బ్యాట్ చేతిలో తిరగడంతో టైమింగ్ మిస్ అయ్యింది. దీంతో బంతి నేరుగా లాంగ్-ఆన్‌లో ఉన్న సూర్యకుమార్ యాదవ్ చేతుల్లోకి వెళ్లింది. మంచి ఫామ్‌లో ఉండి, భారీ స్కోరు దిశగా వెళ్తున్న క్రమంలో ఇలా అవుటవడాన్ని కోహ్లీ జీర్ణించుకోలేకపోయాడు. పెవిలియన్ వైపు వెళ్తూ తీవ్ర నిరాశతో తన గ్లౌజులను విసిరేయడమే కాకుండా, హెల్మెట్‌ను నేలకేసి కొట్టాడు. తన ఇన్నింగ్స్‌ను ఫినిషర్ రోల్లో ముగించలేకపోయానన్న కసి అతని ముఖంలో స్పష్టంగా కనిపించింది.
పాటిదార్, సాల్ట్ మెరుపులు.. ఆర్సీబీ భారీ స్కోరు
టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఆర్సీబీ బ్యాటర్లు ముంబై బౌలర్లను చెడుగుడు ఆడుకున్నారు. ఫిల్ సాల్ట్ విధ్వంసకరమైన బ్యాటింగ్‌తో కేవలం 36 బంతుల్లోనే 78 పరుగులు చేసి ముంబై బౌలర్లపై విరుచుకుపడ్డాడు. సాల్ట్ అవుటయ్యాక వచ్చిన పాటిదార్ మరింత విధ్వంసం సృష్టించాడు. కేవలం 20 బంతుల్లో 53 పరుగులు (5 సిక్సర్లు, 4 ఫోర్లు) చేసి స్కోరు బోర్డును జెట్ స్పీడ్‌తో పరుగులు పెట్టించాడు. చివర్లో వచ్చిన టిమ్ డేవిడ్ కేవలం 16 బంతుల్లో 34 పరుగులు చేయడంతో ఆర్సీబీ నిర్ణీత ఓవర్లలో 240 పరుగుల భారీ స్కోరును సాధించింది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన ముంబై నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి కేవలం 222 పరుగులు మాత్రమే చేయగలిగింది. దీంతో 18 పరుగుల తేడాతో రాయల్ చాలెంజర్స్ చేతిలో ఓడిపోయింది.
READ ALSO: RCB vs MI: సాల్ట్ ‘పవర్’.. పాటిదార్ ‘స్పీడ్’.. కోహ్లీ ‘క్లాస్’.. వాంఖడేలో ఆర్సీబీ విధ్వంసం!
తాజావార్తలు
-
Ceiling Fan Speed: సీలింగ్ ఫ్యాన్ స్పీడ్ తగ్గిందా.? కారణం ఇదే కావచ్చు.! కొత్తది కొనేముందు ఈ విషయాలు తప్పక చెక్ చేయండి.!
-
IRGC attack US 5th Fleet: ఇరాన్ ప్రతీకారం.. అమెరికా 5వ ఫ్లీట్ ప్రధాన కార్యాలయంపై IRGC దాడి!
-
Ruturaj Gaikwad: సెంచరీ వెనుక సీక్రెట్ ఇదే.. రుతురాజ్ గైక్వాడ్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Hyderabad Crime : మల్కాజ్‌గిరిలో కలకలం.. భార్యపై కాల్పులు జరిపి పారిపోయిన భర్త.!
-
Pakistan Airstrikes Afghanistan: ఆఫ్ఘనిస్తాన్పై పాకిస్థాన్ వైమానిక దాడులు.. 13 మంది మృతి
ట్రెండింగ్
-
WWDCలో పొరపాటున ‘ఫోల్డబుల్ ఐఫోన్’ వివరాలు లీక్ చేసుకున్న Apple.!
-
Nail Cutting : సూర్యాస్తమయం తర్వాత గోళ్లు కత్తిరించొద్దంటారు.. అసలు కారణం ఇదే.!
-
Sleep Tips : ప్రశాంతమైన నిద్ర కోసం ఈ 7 అలవాట్లకు దూరంగా ఉండండి
-
Cumin Water Benefits : కడుపు సమస్యలకు నేచురల్ సొల్యూషన్ ఇదే.!
-
India Fertility Rate: యువ భారత్‌కు వృద్ధాప్య గండం.. పిల్లల్ని కనాలంటేనే ఎందుకు భయపడుతున్నారు?