Site icon NTV Telugu

Virat Anushka: పికిల్‌బాల్ భాగస్వాములుగా మారిన విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ జంట..!

Virushka

Virushka

Virat Anushka: విరాట్ కోహ్లీ తన 14 సంవత్సరాల టెస్ట్ ప్రయాణానికి ముగింపు పలికిన విషయం తెలిసిందే. అతను 123 టెస్ట్ మ్యాచ్‌లలో 30 శతకాలు, 31 అర్ధశతకాలతో 9,230 పరుగులు చేసి అనేక రికార్డ్స్ నమోదు చేశాడు. అతని టెస్ట్ కెరీర్ భారత క్రికెట్ చరిత్రలో ఒక గొప్ప అధ్యాయంగా నిలిచిపోతుంది. అంతేకాదు, 40 విజయాలతో నాలుగో అత్యంత విజయవంతమైన టెస్ట్ కెప్టెన్‌గా ఆయన నిలిచాడు. విరాట్ తన టెస్ట్ రిటైర్మెంట్ గురించి బీసీసీఐకి ముందుగానే సమాచారం ఇచ్చినట్లు నివేదికలు తెలిపాయి. అయితే, ఇంగ్లండ్‌తో జరగనున్న ఐదు టెస్ట్ మ్యాచ్‌ల సిరీస్‌కు ముందే ఈ నిర్ణయం తీసుకోవడంతో అభిమానులు తీవ్ర నిరాశ చెందారు.

Read Also: Supreme Court: ప్రొఫెసర్ అలీ ఖాన్ మహ్మదాబాద్‌కు ఊరట.. బెయిల్ మంజూర్

టెస్ట్‌కు వీడ్కోలు చెప్పిన అనంతరం, విరాట్ కోహ్లీ తన భార్య అనుష్క శర్మతో కలిసి శ్రీకృష్ణ బాల్యం గడిపిన బృందవనాన్ని సందర్శించారు. అక్కడ వారు ప్రముఖ సంత్ ప్రీమనంద్ గోవింద్ శరణ్ మహారాజ్ ఆశీర్వాదం పొందారు. అందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇకపోతే ప్రస్తుతం విరాట్ ఇప్పుడు IPL 2025లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) తరఫున మంచి ఆటతీరు కనబరుస్తున్నాడు. ఈ నేపథ్యంలో తాజాగా తన భార్య అనుష్క శర్మతో కలిసి పికిల్‌బాల్ ఆటను ఆస్వాదించాడు. RCB శిబిరంలో దినేష్ కార్తిక్, దీపికా పల్లికల్ జంట కూడా ఈ ఆటలో పాల్గొంది. ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో షేర్ చేసిన RCB “పికిల్‌బాల్ ఫీవర్ మా టీమ్‌ను కుదిపేసింది” అని పేర్కొంది. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి.

Read Also: MP Mithun Reddy: అరాచక పాలన.. భయపెట్టి పాలించడం మూర్ఖత్వం..!

Exit mobile version