Ind vs SL 1st Odi: తొలి వన్డేలో లంక ఎదుట భారత్ భారీ లక్ష్యాన్ని ఉంచింది. నిర్ణీత 50 ఓవర్లలో భారత్ 373 పరుగులు చేసింది. శ్రీలంకకు 374 పరుగుల భారీ లక్ష్యాన్ని అందించింది. శ్రీలంకపై తొలివన్డేలో ఓపెనర్లు రోహిత్ శర్మ (83), శుభ్‌మన్ గిల్ (70) భారత్‌కు శుభారంభం అందించగా, 20వ ఓవర్‌లో బ్యాటింగ్‌కు వచ్చిన విరాట్ కోహ్లీ అద్భుతంగా ఆడి శతక్కొట్టాడు. విరాట్ శ్రీలంక కెప్టెన్ దసున్ షనక వేసిన 22వ ఓవర్‌లో తన మొదటి బౌండరీని కొట్టాడు. అక్కడి నుంచి కోహ్లీకి రెండు అవకాశాలు లభించాయి. కోహ్లీ 47 బంతుల్లో అర్ధ సెంచరీ చేసిన తర్వాత, 37వ ఓవర్‌లో కసున్ రజిత బౌలింగ్‌లో వికెట్ కీపర్ కుసాల్ మెండిస్ క్యాచ్ డ్రాప్ చేశాడు. మళ్లీ 43వ ఓవర్‌లో రజిత బౌలింగ్‌లో లంక ఆటగాళ్లు మరోసారి కోహ్లీ క్యాచ్‌ను డ్రాప్ చేశారు. ఈసారి అతను 81 పరుగుల వద్ద బ్యాటింగ్ చేస్తున్నప్పుడు షనక కోహ్లీ క్యాచ్‌ను డ్రాప్ చేశాడు. 87 బంతులు ఆడి 113 పరుగులు చేసిన విరాట్ కోహ్లీ మెండిస్ బౌలింగ్‌లో వెనుదిరిగాడు.
Virat Kohli: వన్డే కెరీర్‌లో కోహ్లీ 45వ సెంచరీ పూర్తి.. సచిన్ రికార్డు సమం
విరాట్ కోహ్లీ తన 73వ అంతర్జాతీయ సెంచరీని నమోదు చేశాడు. తొలుత టాస్ గెలిచిన శ్రీలంక కెప్టెన్ దసున్ షనక భారత్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించడంతో రోహిత్ శర్మ (83), శుభ్‌మన్ గిల్ (70) 143 పరుగుల ఓపెనింగ్ స్టాండ్‌తో భారత్‌కు గట్టి వేదికను అందించారు. భారత జట్టు శుభ్‌మన్ గిల్ , రోహిత్ శర్మ ఇద్దరినీ కోల్పోయిన తర్వాత, విరాట్ కోహ్లీ బాధ్యతలు స్వీకరించి జట్టును ఇన్నింగ్స్‌లో భారీ స్కోరు దిశగా కొనసాగించాడు. శ్రీలంక బౌలర్లలో కసున్ రజిత మూడు వికెట్లను తీయగలిగాడు. రజిత తన 10 ఓవర్ల స్పెల్‌లో 88 పరుగులను ఇచ్చాడు. మధుషంక, కరుణరత్నే,షనక తలో వికెట్ తీయగలిగారు.