Virat Kohli 500 Match: చరిత్రకు అడుగు దూరంలో విరాట్ కోహ్లీ!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Virat Kohli to Play 500 International Match: గురువారం నుంచి వెస్టిండీస్, భారత్ జట్ల మధ్య రెండో టెస్టు ప్రారంభం కానుంది. తొలి టెస్టులో ఇన్నింగ్స్ 141 పరుగుల తేడాతో ఘన విజయం సాధించిన భారత్.. రెండో టెస్టులో కూడా గెలిచి సిరీస్ క్లీన్ స్వీప్ చేయాలని చూస్తోంది. తొలి టెస్టులో పూర్తిగా తేలిపోయిన వెస్టిండీస్.. రెండో టెస్టులో అయినా కనీస పోటీ ఇవ్వాలని భావిస్తోంది. ఇక విండీస్, భారత్ జట్లకు ఈ టెస్ట్ మ్యాచ్ ప్రత్యేకంగా నిలవనుంది. ఎందుకంటే ఇరు జట్ల మధ్య ఇది 100వ టెస్టు మ్యాచ్. మరోవైపు టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీకి కూడా ఈ టెస్ట్ చాలా చాలా ప్రత్యేకం.
మూడు (టెస్టులు, వన్డేలు, టీ20) ఫార్మాట్లో కలిపి టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ ఇప్పటివరకు 499 మ్యాచులు ఆడాడు. జులై 20 నుంచి వెస్టిండీస్, భారత్ జట్ల మధ్య ఆరంభం కానున్న రెండో టెస్టు కోహ్లీకి 500వ మ్యాచ్. దాంతో 500 లేదా అంతకంటే ఎక్కువ అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడిన ప్లేయర్ల జాబితాలో కోహ్లీ చేరనున్నాడు. కోహ్లీ రెండో టెస్ట్ మ్యాచ్ ఆడితే.. ఇంటర్నేషనల్ ఫార్మాట్లో 500 మ్యాచ్‌లు ఆడిన 10వ ప్లేయర్‌గా దిగ్గజాల సరసన నిలుస్తాడు. ఈ ఫీట్ అందుకున్న నాలుగో భారత బ్యాటర్‌గానూ నిలుస్తాడు.
Also Read
- Ajinkya Rahane: "ధోనీ, కోహ్లీ కానే కాదు.. టీమిండియా ఆల్‌టైమ్ గ్రేట్ అతడే".. రహానే ఆసక్తికర వ్యాఖ్యలు..
- Will Jacks: సూపర్‌మ్యాన్ ఫీల్డింగ్.. అయ్యా బాబోయ్..! ఏంటి జాక్ క్యాచ్ ను అలా పట్టేశావ్.!
- Sridhar Babu: త్వరలోనే డిజిటల్ అసెంబ్లీ, డిజిటల్ కౌన్సిల్.. మంత్రి శ్రీధర్ బాబు కీలక ప్రకటన
- KL Rahul: టీమిండియాకు భారీ షాక్.. శుభ్‌మన్ గిల్ అవుట్.. కెప్టెన్‌గా కేఎల్ రాహుల్.!
Also Read: Preganancy Tips: గర్భధారణ సమయంలో మహిళలు ఈ ఉత్పత్తులు వాడకూడదు.. పిల్లలకి ప్రమాదం!
భారత్ తరఫున ఇప్పటివరకు ముగ్గురు ప్లేయర్లు మాత్రమే 500 కంటే ఎక్కువ అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడారు. 664 మ్యాచ్‌లతో మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ అగ్రస్థానంలో ఉన్నాడు. 538 మ్యాచ్‌లతో మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ రెండో స్థానంలో ఉండగా.. 509 మ్యాచ్‌లతో మాజీ సారథి రాహుల్ ద్రవిడ్ ఉన్నాడు. ప్రస్తుతం విరాట్ వయసు 34. అత్యుత్తమ ఫిట్నెస్ ఉన్న కోహ్లీ.. మరో 4-5 ఏళ్ల పాటు ఆడగలడు. దీంతో ద్రవిడ్, ధోనీలను సునాయాసంగా దాటగలడు.
మొత్తంగా చూసుకున్నా ఎక్కువ అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడింది మన సచిన్ టెండూల్కరే. సచిన్ తర్వాత 652 మ్యాచ్‌లతో శ్రీలంక మాజీ కెప్టెన్ మహేల జయవర్ధనే ఉన్నాడు. శ్రీలంక మాజీ ప్లేయర్స్ కుమార్ సంగక్కర (594), సనత్ జయసూర్య (586) తర్వాతి స్థానాల్లో ఉన్నారు. ఆస్ట్రేలియా మాజీ ప్లేయర్ రికీ పాంటింగ్ (560) ఐదవ స్థానంలో ఉండగా.. ఎంఎస్ ధోనీ (538) టాప్ 6లో కొనసాగుతున్నాడు. టాప్ 10లో రాహుల్ ద్రవిడ్ ఉన్నారు.
Also Read: Best CNG Cars Under 10 Lakh: ధర తక్కువ, మైలేజ్ ఎక్కువ.. బెస్ట్ సీఎన్జీ కార్స్ ఇవే!
తాజావార్తలు
-
Ajinkya Rahane: “ధోనీ, కోహ్లీ కానే కాదు.. టీమిండియా ఆల్‌టైమ్ గ్రేట్ అతడే”.. రహానే ఆసక్తికర వ్యాఖ్యలు..
-
Salman Khan: అస్సాం వరద బాధితులకు అండగా సల్మాన్ ఖాన్.. 500 కొత్త ఇళ్ల నిర్మాణానికి సహాయం
-
Deepika Padukone: ‘రాకా’.. హీరోయిన్ దీపికా పదుకొనే పనైపోయినట్టే, ఇక అవుట్!
-
Will Jacks: సూపర్‌మ్యాన్ ఫీల్డింగ్.. అయ్యా బాబోయ్..! ఏంటి జాక్ క్యాచ్ ను అలా పట్టేశావ్.!
-
Sridhar Babu: త్వరలోనే డిజిటల్ అసెంబ్లీ, డిజిటల్ కౌన్సిల్.. మంత్రి శ్రీధర్ బాబు కీలక ప్రకటన
ట్రెండింగ్
-
John Turner Retirement: ఇంగ్లండ్ స్టార్ సంచలన నిర్ణయం.. 25 ఏళ్లకే క్రికెట్‌కు గుడ్‌బై.. కారణం తెలిస్తే షాక్!
-
Jowar Roti: ‘జొన్న రొట్టె’ విరిగిపోతుందా..? లేదా గట్టిగా అవుతుందా.? ఇలా చేస్తే మెత్తగా, బాగా పొంగే రొట్టెలు గ్యారెంటీ.!
-
10mm డైనమిక్ డ్రైవర్లు, ANC, 48 గంటల బ్యాటరీతో JBL Live Buds 4, Live Beam 4 లాంచ్..!
-
12 అంగుళాల 2K 90Hz డిస్ప్లే, క్వాడ్ స్పీకర్లతో HP OmniPad 12 భారత్‌లో లాంచ్..!
-
రూ.9.99 లక్షలకే పెట్రోల్, డీజిల్, CNG ఆప్షన్లతో Tata Nexon Camo ఎడిషన్ లాంచ్..!