NTV Telugu Site icon

Virat Kohli 500 Match: చరిత్రకు అడుగు దూరంలో విరాట్ కోహ్లీ!

Virat Kohli

Virat Kohli

Virat Kohli to Play 500 International Match: గురువారం నుంచి వెస్టిండీస్‌, భారత్ జట్ల మధ్య రెండో టెస్టు ప్రారంభం కానుంది. తొలి టెస్టులో ఇన్నింగ్స్‌ 141 పరుగుల తేడాతో ఘన విజయం సాధించిన భారత్.. రెండో టెస్టులో కూడా గెలిచి సిరీస్ క్లీన్ స్వీప్ చేయాలని చూస్తోంది. తొలి టెస్టులో పూర్తిగా తేలిపోయిన వెస్టిండీస్.. రెండో టెస్టులో అయినా కనీస పోటీ ఇవ్వాలని భావిస్తోంది. ఇక విండీస్‌, భారత్ జట్లకు ఈ టెస్ట్ మ్యాచ్ ప్రత్యేకంగా నిలవనుంది. ఎందుకంటే ఇరు జట్ల మధ్య ఇది 100వ టెస్టు మ్యాచ్. మరోవైపు టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీకి కూడా ఈ టెస్ట్ చాలా చాలా ప్రత్యేకం.

మూడు (టెస్టులు, వన్డేలు, టీ20) ఫార్మాట్‌లో కలిపి టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ ఇప్పటివరకు 499 మ్యాచులు ఆడాడు. జులై 20 నుంచి వెస్టిండీస్‌, భారత్ జట్ల మధ్య ఆరంభం కానున్న రెండో టెస్టు కోహ్లీకి 500వ మ్యాచ్. దాంతో 500 లేదా అంతకంటే ఎక్కువ అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడిన ప్లేయర్ల జాబితాలో కోహ్లీ చేరనున్నాడు. కోహ్లీ రెండో టెస్ట్ మ్యాచ్ ఆడితే.. ఇంటర్నేషనల్ ఫార్మాట్‌లో 500 మ్యాచ్‌లు ఆడిన 10వ ప్లేయర్‌గా దిగ్గజాల సరసన నిలుస్తాడు. ఈ ఫీట్ అందుకున్న నాలుగో భారత బ్యాటర్‌గానూ నిలుస్తాడు.

Also Read: Preganancy Tips: గర్భధారణ సమయంలో మహిళలు ఈ ఉత్పత్తులు వాడకూడదు.. పిల్లలకి ప్రమాదం!

భారత్ తరఫున ఇప్పటివరకు ముగ్గురు ప్లేయర్లు మాత్రమే 500 కంటే ఎక్కువ అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడారు. 664 మ్యాచ్‌లతో మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ అగ్రస్థానంలో ఉన్నాడు. 538 మ్యాచ్‌లతో మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ రెండో స్థానంలో ఉండగా.. 509 మ్యాచ్‌లతో మాజీ సారథి రాహుల్ ద్రవిడ్ ఉన్నాడు. ప్రస్తుతం విరాట్ వయసు 34. అత్యుత్తమ ఫిట్‌నెస్ ఉన్న కోహ్లీ.. మరో 4-5 ఏళ్ల పాటు ఆడగలడు. దీంతో ద్రవిడ్, ధోనీలను సునాయాసంగా దాటగలడు.

మొత్తంగా చూసుకున్నా ఎక్కువ అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడింది మన సచిన్ టెండూల్కరే. సచిన్ తర్వాత 652 మ్యాచ్‌లతో శ్రీలంక మాజీ కెప్టెన్ మహేల జయవర్ధనే ఉన్నాడు. శ్రీలంక మాజీ ప్లేయర్స్ కుమార్ సంగక్కర (594), సనత్ జయసూర్య (586) తర్వాతి స్థానాల్లో ఉన్నారు. ఆస్ట్రేలియా మాజీ ప్లేయర్ రికీ పాంటింగ్ (560) ఐదవ స్థానంలో ఉండగా.. ఎంఎస్ ధోనీ (538) టాప్ 6లో కొనసాగుతున్నాడు. టాప్ 10లో రాహుల్ ద్రవిడ్ ఉన్నారు.

Also Read: Best CNG Cars Under 10 Lakh: ధర తక్కువ, మైలేజ్ ఎక్కువ.. బెస్ట్ సీఎన్‌జీ కార్స్ ఇవే!