ఏదేమైనా, అప్పుడప్పుడు పరిస్థితులు కొన్ని హాస్యభరితంగా మారుతుంటాయి. బెంగళూరులోని ఒక మహిళ అర్థరాత్రి కేక్ ఆర్డర్ సంబంధించి తన అనుభవాన్ని పంచుకుంది. ఒక సూచనతో కేక్ ఎలా ఆర్డర్ చేసిందో ఆమె వివరించింది. అందులో “దయచేసి పుట్టినరోజు శుభాకాంక్షలు స్టిక్ తో పంపండి”. అయితే కంపెనీ వారు కేక్ మీదకు పుట్టినరోజు శుభాకాంక్షలు స్టిక్ పంపడం బదులుగా., బేకరీ వారు కేక్ మీద నేరుగా “హ్యాపీ బర్త్ డే స్టిక్” అనే పదాలను రాసి పంపారు. ఈ ఊహించని ఘటన సోషల్ మీడియా నెటిజన్స్ ను ఆశ్చర్యపరిచింది. ఇక ఈ సందర్భం సంబంధించి బిల్లుతో పాటు పంచుకున్న వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది.
Also read: UP: దారుణం.. మైనర్ బాలికపై అత్యాచారం.. ఆపై వేడి ఇనుప రాడ్తో..
వీడియోలో., బిల్లు పై “హ్యాపీ బర్త్ డే స్టిక్” కోసం అభ్యర్థనను స్పష్టంగా చూపిస్తుంది. కాకపోతే కేక్ వచ్చిన తరువాత ఆకుపచ్చ కలర్ లో అదే పదబంధంతో రాసిన ఉన్న కేక్ ను పంపించారు. ఇక ఈ విషయాన్నీ ఆ మహిళ హాస్యభరితంగా స్విగ్గీ ఇండియాను ట్యాగ్ చేసి, ఈ పరిస్థితిపై తన అసంతృప్తిని వ్యక్తం చేసింది. జరిగిన తప్పును చూపిస్తూ.. “హ్యాపీ బర్త్ డే స్టిక్ ‘యే క్యా హై భాయ్” అని ఆమె పంచుకుంది. ఇది తన చెల్లెలి పుట్టినరోజు అని వివరిస్తూ., తాము తన చెల్లిని ఆశ్చర్యపరుస్తారని ఆశతో ఒక చిన్న కేక్ ను ఆర్డర్ ఇస్తే.. చివరికి ఇలా జరిగందంటూ వాపోయింది.
Also read: Stock Markets: భారీ నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్స్.. లాభాల స్వీకరణకు ఇన్వెస్టర్ల మొగ్గు..
“దీనిని ‘కేక్ టాపర్’ అని పిలుస్తారని నాకు తెలియదు.. కానీ., నేను మొత్తం వాక్యాన్ని కూడా రాశాను. వారు కనీసం సరిగ్గా చదివి అర్థం చేసుకోవాలని నొక్కి చెప్పింది. ఇక ఇందుకు సంబంధించి వీడియో వైరల్ కావడంతో నెటిజెన్స్ వారికి జరిగిన డెలివరీ పొరపాట్లకు సంబంధించి కూడా కొందరు కామెంట్ చేశారు.