NTV Telugu Site icon

Cricket Viral Video: దురదృష్టం వెక్కిరిస్తే ఇలానే ఉంటుంది మరి.. క్రికెట్ హిస్టరీలో అన్‌లక్కీ ఔట్!

Funny Cricket Viral Video

Funny Cricket Viral Video

Funny Cricket Viral Video: క్రికెట్‌లో మనం చాలా రకాల అవుట్‌లను చూసుంటాం. బౌలర్ అద్భుతంగా బౌలింగ్ చేయడం వల్లనో లేదా బ్యాటర్ల లేజీనెస్‌ కారణంగానో లేదా ఆటగాళ్ల మెరుపు ఫీల్టింగ్‌తోనూ వికెట్లు పడటం చూస్తాం. కానీ ఓ బ్యాటర్ విచిత్రంగా ఔటయ్యాడు. మ్యాచ్‌లలో ఆటతో పాటు కాసింత అదృష్టం కూడా ఉండాలంటారు. కానీ ఈ బ్యాటర్‌కు మాత్రం అదృష్టం అస్సలే లేనట్లు కనిపిస్తోంది. అతను ఔటైన తీరు చూస్తే మీరు కూడా ఇదే మాట అంటారు.

మంగళవారం యార్క్‌షైర్ సెకండ్ లెవన్‌, సోమర్సెట్ సెకండ్ లెవన్ జట్ల మధ్య మ్యాచ్‌ జరిగింది. సోమర్సెట్ ఇన్నింగ్స్‌లో ఓ ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. సోమర్సెట్ బ్యాటర్ లియోనార్డ్ అనూహ్య రీతిలో పెవిలియన్‌కు చేరాడు. యార్క్‌షైర్ బౌలర్ క్లిఫ్ వేసిన బంతిని లియోనార్డ్ భారి షాట్‌ ఆడాడు. బంతి నాన్‌స్ట్రైకర్‌ వైపు వెళ్లగా.. అతడు తప్పించుకోవడానికి ప్రయత్నించినప్పటికీ బలంగా తాకి గాల్లోకి లేచింది. బౌలర్ క్లిఫ్ సునాయాస క్యాచ్ అందుకున్నాడు. దీంతో లియోనార్డ్ నిరాశగా పెవిలియన్ చేరాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దురదృష్టం వెక్కిరిస్తే ఇలానే ఉంటుంది మరి, క్రికెట్ హిస్టరీలో అన్‌లక్కీ ఔట్ అంటూ నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

Also Read: Samsung Galaxy M35 5G Price: తక్కువ ధర, భారీ బ్యాటరీతో ‘శాంసంగ్‌’ కొత్త ఫోన్.. ఫుల్ డీటెయిల్స్ ఇవే!

ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన సోమర్సెట్ నిర్ణీత 20 ఓవర్లలో 191 పరుగులకు ఆలౌటైంది. ఓపెనర్ థామస్ 27 బంతుల్లో నాలుగు ఫోర్లు, మూడు సిక్సర్లతో 52 పరుగులు చేశాడు. యార్క్‌షైర్ బౌలర్లలో హిల్ నాలుగు, క్లిఫ్ మూడు వికెట్లు పడగొట్టారు. ఛేదనలో యార్క్‌షైర్ 16.5 ఓవర్లలో 125 పరుగులకు ఆలౌట్ అయింది. 15 బంతుల్లో 5 ఫోర్లతో 27 రన్స్ చేసిన వగాడియా టాప్ స్కోరర్‌గా నిలిచాడు. లియోనార్డ్ నాలుగు వికెట్స్ పడగొట్టాడు. సోమర్సెట్ 66 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.

Show comments