యాక్సిడెంట్ తిథి బాధపడాలి కానీ.. నవ్వు రావడమేంటి.., అనుకుంటున్నారా..? అయితే., మీలో ఎవరైనా ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు తెగ నవ్వుకుంటున్నారు. ఈ ఘటన ఎక్కడ జెరిగిందో కానీ., ఓ ఇద్దరు యువతులు చేసిన పనికి సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియో లో గమనిస్తే.. అక్కడ ఓ ఇంటి పైకప్పులో చిక్కుకుపోయిన ఒక స్కూటీ, ఇద్దరు యువతులు కనపడతారు. నిజానికి అక్కడ ఉన్న ఇల్లు రోడ్డు కంటే కాస్త కిందికే ఉన్నట్లు అర్థమవుతుంది.
Also Read: Viral Video: ఏంది భయ్యా ఇది.. సాఫ్ట్ డ్రింక్ క్యాన్లలో ఇంత సీక్రెట్ దాగుందా..?!
నిజానికి ఇలా ఉంటే., వాహనాలు అదుపుతప్పిన సమయంలో నేరుగా ఇంటిపైకప్పు మీదకు దూసుకపోవడం గ్యారెంటీ. ఆచం ఇదే ఆ యువతుల విషయంలో కూడా దాదాపుగా ఇదే జరిగింది. కాకపోతే ఈ యాక్సిడెంట్ ఎలా జరిగిందో తెలియదు కానీ.. ఇద్దరు యువతులు కూర్చున్న స్కూటీ నేరుగా ఆ ఇంటి పైకప్పు లోకి దూసుకుపోయింది. ఈ దెబ్బతో ఆ ఇంటికి పెద్ద రంధ్రం ఏర్పడింది. అంతేకాదు బండిపై ఉన్న యువతులు కూడా అందులోనే చిక్కుకుపోవడంతో అక్కడి వారు వారిని బయటకు లాగే ప్రయత్నం చేస్తున్నారు.
also read: Viral: ఎలావస్తాయో ఇలాంటి ఐడియాలు.. ట్రాఫిక్ జామ్ లో ఆ మహిళ చేసిన పనిచూస్తే వావ్ అనాల్సిందే..!
ఈ సంఘటనకి సంబంధించిన వీడియో మొత్నాన్ని చూసి నెటిజన్లు తనివి తీరా నవ్వుకుంటున్నారు. అయితే ఘటనకు గురైన యువతులకు ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో నెటిజన్స్ హర్షం వ్యక్తం చేస్తూనే.. మరోవైపు యువతులపై వరుస పెట్టి వారి స్టైల్ లో కామెంట్స్ చేస్తున్నారు. వాహనాన్ని ఇలాగా ఎప్పుడైనా పార్క్ చేసారా అంటూటే.. మరికొందరు.. సరదా సెటైర్లు పేల్చారు. ఇంకొంత మాత్రం ఈ ఘటన పై ఆవేదన వ్యక్తం చేశారు. డ్రైవింగ్ చేసే సమయంలో ప్రతినిత్యం అప్రమత్తంగా ఉండాలని., ఎటువంటి ఏమరపాటుగా ఉంటే మాత్రం ప్రాణాలకే ప్రమాదమని హెచ్చరించారు.