Site icon NTV Telugu

Viral Video: ఎద్దు ముందు మోకరిల్లిన రెండు క్రూరమైన జాగ్వార్‌లు.. షాకింగ్ వీడియో

Viral Video

Viral Video

సోషల్ మీడియాలో ఒక షాకింగ్ వీడియో వైరల్ అవుతోంది. ఇది నెటిజన్లను ఆశ్చర్యపరిచింది. ఇందులో రెండు జాగ్వార్‌లు ఓ ఎద్దు ముందు మోకరిల్లినట్లు కనిపిస్తోంది. జాగ్వార్‌ల వంటి ప్రమాదకరమైన మాంసాహారుల నుంచి తన ప్రాణాలను కాపాడుకునే ఈ ఎద్దు, ఎవరూ ఊహించని పని చేసింది. అందుకే ఈ వీడియో ఇంటర్నెట్‌లో సంచలనం సృష్టిస్తోంది.

READ MORE: Toll Tax: తప్పుడు ప్రచారం.. టూవీలర్లకు ‘‘టోల్ ట్యాక్స్’’పై నితిన్ గడ్కరీ క్లారిటీ..

వైరల్ అవుతున్న వీడియోలో.. రెండు జాగ్వార్లు ఒక పెద్ద ఎద్దుకు ఎదురుగా నిలబడ్డాయి. క్లిప్ చూసినప్పుడు.. మొదట జాగ్వార్లు ఎద్దును తేలికగా తీసుకున్నట్లు కనిపించింది. కానీ ఎద్దు ఈ పులుల వైపునకు వెళ్ళగానే, రెండు జాగ్వార్లు భయపడతాయి. ఎద్దు వేగంగా ముందుకు వెళ్లడంతో జాగ్వర్‌లు అక్కడి నుంచి పరుగులు పెడతాయి. భయంతో దట్టమైన అడవిలోకి పారిపోతాయి. దాదాపు 28 సెకన్ల ఈ క్లిప్ ను చూసిన ప్రజలు రెండు జాగ్వర్లు ఎద్దును భయపడటాన్ని చూసి ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. @Pandit_G_143 అనే హ్యాండిల్ నుంచి ఈ వీడియోను షేర్ చేశారు. “వీడియో ఇక్కడ చూడండి, 2 ప్రమాదకరమైన జాగ్వర్లు ఎద్దు ముందు మోకరిల్లాయి.” అని క్యాప్షన్‌లో రాశారు. ఈ వార్త రాసే సమయానికి, ఈ వీడియోను 4 లక్షలకు పైగా వీక్షించారు. నెటిజన్లు వివిధ రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. ఈ వీడియో ఎప్పుడు, ఎక్కడ జరిగింది? అనే సమాచారం లేదు.

READ MORE: MLA Raja Singh: డీజీపీకి బీజేపీ ఎమ్మేల్యే రాజా సింగ్ కీలక లేఖ..

Exit mobile version