Site icon NTV Telugu

Viral Video: మరణం దరిదాపుల్లోకి వృద్ధుడు.. దేవుడిలా వచ్చి కాపాడిన RPF కానిస్టేబుల్..!

Viral Video

Viral Video

Viral Video: మధ్యప్రదేశ్‌ లోని బేతూల్ రైల్వే స్టేషన్ వద్ద మొబైల్‌ ఫోన్‌ వాడడం వల్ల ఓ వృద్ధుడు ప్రాణాల్ని కోల్పోయే ప్రమాదం నుంచి బయటపడ్డాడు. చివరి క్షణంలో వృద్ధుడిని RPF కానిస్టేబుల్ సత్య ప్రకాష్ రాజుర్కర్ కాపాడాడు. దీనితో ఆయన చేసిన సాహసానికి ఇప్పుడు దేశవ్యాప్తంగా ప్రశంసలు కురుస్తున్నాయి ప్రజలు. అసలు ఏమి జరిగిందన్న విషయంలోకి వెళితే..

66 ఏళ్ల రాకేశ్ కుమార్ జైన్ భోపాల్-నాగ్‌పూర్ స్వర్ణ జయంతి ఎక్స్‌ప్రెస్‌ లో ప్రయాణిస్తున్నాడు. అయితే జర్నీ మధ్యలో నుంచి కాస్త నడవాలనే ఉద్దేశ్యంతో స్టేషన్‌లో దిగాడు. అయితే, అక్కడే ఓ మూలలో కూర్చుని తన మొబైల్‌ఫోన్‌ స్క్రోలింగ్‌లో లీనమయ్యాడు. ఆ సమయంలో టైమ్ గమనించలేదు.. మరోవైపు ట్రైన్ నెమ్మదిగా కదలడం ప్రారంభించినా కూడా ఆ విషయాన్ని గుర్తించలేదు.

Gold Rate Today: అయ్యబాబోయ్.. బెంబేలేత్తిస్తున్న బంగారం ధరలు! కొనడం కష్టమే ఇగ

ఇక ప్రస్తుతం వైరల్‌ అయిన CCTV వీడియోలో, ట్రైన్ కదలడం ప్రారంభించి వేగం అందుకున్నట్లుగా కనిపిస్తుంది. అప్పటికి జైన్ మెల్లగా పైకి చూసి ట్రైన్ ముందుకెళ్లిపోతున్న విషయాన్ని గమనిస్తాడు. దీనితో వెంటనే పరుగెత్తి ఓ బోగీ హ్యాండిల్ పట్టుకునే ప్రయత్నం చేస్తారు. కానీ చేతులు జారిపోవడంతో కింద పడ్డారు. అంతేకాదు కాళ్లు జారి ట్రైన్ చక్రాల దగ్గరకు వెళ్లిపోయాయి కూడా.. ఆయన తల కూడా ట్రైన్ చక్రాలకు అతి దగ్గరగా వెళ్లేలా కనిపించింది.

Shocking Viral Video: వామ్మో.. ఇదేంటి భయ్యా.. బల్లి తోక నుండి మంటలు రావడం.. వైరల్ వీడియో!

ఆ సమయంలో ప్లాట్ ఫామ్ మీద డ్యూటీలో ఉన్న RPF కానిస్టేబుల్ సత్యప్రకాశ్ రాజుర్కర్, గమనించి ఎలాంటి ఆలస్యం చేయకుండా జైన్ వైపు పరుగెత్తాడు. ఆ వృద్ధుడిని బోగీకి తాకేలోపు పక్కకు లాగి బయటకు రక్షించాడు. ఆ తర్వాత ఆ వృద్ధుడిని పక్కన కూర్చోబెట్టి ఆయనను ఆ సంఘటన నుండి బయటపడేలా చేశారు. ఆ తర్వాత వృద్ధుడు మాట్లాడుతూ.. నడవడానికి కేవలం రెండు నిమిషాలే అనుకున్నాను. ఫోన్‌లో మునిగి టైమ్ మర్చిపోయాను. కానిస్టేబుల్ సత్యప్రకాశ్ లాగి ఉండకపోతే… నేను బతికి ఉండే వాడిని కానని అన్నారు. ఇక ఈ వీడియోను చూసిన సోషల్ మీడియా నెటిజన్స్ సదరు RPF పోలీసుకు నీరాజనాలు పడుతున్నారు.

Exit mobile version