సోషల్ మీడియాలో క్రేజ్ కోసం జనాలు ఎన్నెన్నో జిమ్మిక్కులు చేస్తున్నారు.. ముఖ్యంగా జనాలు రద్దీగా ఉండే ప్రాంతాల్లో విన్యాసాలు, డ్యాన్స్ లు చేస్తూ జనాలను ఆకట్టుకుంటున్నారు.. ఇలాంటి డ్యాన్స్ వీడియోలకు ఈ మధ్య సోషల్ మీడియాలో డిమాండ్ పెరిగింది.. దాంతో ప్రతి ఒక్కరు కూడా ఇలానే ఏదొక ప్రాంతంలో డ్యాన్స్ చేస్తూ సోషల్ మీడియా స్టార్స్ అవుతున్నారు.. తాజాగా ఇద్దరు అమ్మాయిలు డ్యాన్స్ అదరగొట్టిన వీడియో ఒకటి సోషల్ మీడియా లో తెగ వైరల్ అవుతుంది.. ఇది ఢిల్లీ మెట్రో లో వెలుగు చూసింది..
ఇప్పటికే ఢిల్లీ మెట్రో లో అన్ని రకాల పనులకు సంబంధించిన దృశ్యాలు కనిపించాయి. మెట్రోలో చాలా మంది ప్రయాణికులు తమ ఇంట్లో చేసే పనులు, వీధుల్లో చేసే పనులన్నీ చేశారు. మెట్రోలో వాదించుకోవడం, కొట్లాడు కోవటం, డ్యాన్సులు, పాటలు పాడటం, ముద్దులు పెట్టుకుంటూ, అసభ్యకరమైన లు చూసే వారిని మీరు చూసారు. పోల్ డ్యాన్స్ మాత్రమే మిగిలింది.. ఇప్పుడు ఈ ఇద్దరు అమ్మాయిలు ఆ పనిని కూడా పూర్తి చేసారు, దీనిని చూసి కొంతమంది వినియోగదారులు మెట్రో ఇప్పుడు ఉచిత వినోదాన్ని పంచె సాధనంగా మారిందని అంటున్నారు..
ఢిల్లీ మెట్రోలో ముద్దులు పెట్టుకోవడం, పిడిగుద్దుల తో కొట్టుకోవటం తర్వాత, ఇదిగో ఇప్పుడు పోల్ డ్యాన్స్ వీడియో హల్‌చల్ చేస్తోంది. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ క్లిప్ కు 61 వేలకు పైగా వ్యూస్ వచ్చాయి. ఐదు వందలకు పైగా లైక్‌లు వచ్చాయి. వినియోగదారులు ఈ వీడియోపై తమ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు… అందమైన అమ్మాయిలు చేసిన డ్యాన్స్ మాత్రం సూపర్ గా ఉందని కొందరు కామెంట్స్ చెయ్యగా మరి కొంతమంది మాత్రం వీరికి పిచ్చి కానీ పట్టిందా అంటూ కామెంట్ల తో తెగ రచ్చ చేస్తున్నారు.. మొత్తాని కో ఈ వీడియో మాత్రం సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతుంది.. మీరు ఒక లుక్ వేసుకోండి..
After porn, kissing and fighting in Delhi Metro,
The latest is Pole Dancing…..
🤣🤣🤣🤣🤣 pic.twitter.com/RpvKJ9jLny— Hasna Zaroori Hai 🇮🇳 (@HasnaZarooriHai) July 6, 2023