NTV Telugu Site icon

Viral Video: పేషెంట్ల వార్డుల్లో స్కూటీపై చక్కర్లు కొడుతున్న నర్సు.. చివరికి..

Pilibhit Hospital Viral Video

Pilibhit Hospital Viral Video

యుపిలోని పిలిభిత్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో ఓ స్టాఫ్ నర్సు తన ఇష్టానుసారం వ్యవహరించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వేగంగా వైరల్ అవుతోంది. ఓ స్టాఫ్ నర్సు స్కూటర్‌ పై కూర్చొని నేరుగా పేషెంట్ల వార్డులో తిరుగుతున్న వీడియో వైరల్ అయింది. ఆమె చేసిన పని వల్ల కారిడార్‌ లో కూర్చొని చికిత్స పొందుతున్న రోగులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.

Also Read: AP PGECET 2024: అలర్ట్.. ఏపీ పీజీఈసెట్ దరఖాస్తులో తప్పులు చేసారా.. సవరణలకు అవకాశం..

ఇక ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ., CMO ఇప్పుడు ఆమె చర్య గురించి మాట్లాడింది. అంతేకాకుండా., ఆమె చేసిన ఇలాంటి చర్యలపై సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇలాంటి వైద్య సిబ్బందిని వెంటనే తొలగించాలని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి అనేక దారుణాలు జరుగుతున్న నేపథ్యంలో ప్రజలు ప్రభుత్వ ఆసుపత్రులు రావడానికి ఆలోచిస్తున్నారు. ఎవరికైనా ఎమర్జెన్సీ సమయంలో హాస్పిటల్ కి వచ్చిన వారిని చూసేందుకు ఒక్కోసారి వైద్యులు కూడా అందుబాటులో లేకపోవడం వల్ల అనేకమంది ప్రాణాలు విడిచిన సంఘటనలు కూడా లేకపోలేదు. ఇకపోతే ప్రస్తుతం వైరల్ గా మారిన ఈ వీడియోలో నర్స్ చేసిన పనికి గాను ఆ రాష్ట్ర వైద్య శాఖ తగిన చర్యలు తీసుకోబోతున్నారు.