NTV Telugu Site icon

Viral video : తల్లితో కొడుకు ప్రాంక్.. హార్ట్ టచింగ్ వీడియో వైరల్..

Karnakata

Karnakata

తల్లి, బిడ్డల అనుభందం గురించి ఎంత చెప్పినా తక్కువే.. ఆ బంధానికి పేరు, సరి తూగె ప్రేమ మరొకటి లేదు.. ఎక్కడ.. ఎంత మందిలో ఉన్నా కూడా తన కొడుకును తల్లి గుర్తు పడుతుంది.. తన పిల్లల విషయంలో చాలా నిస్వార్ధంగా ఉంటుంది. వారి కోసం ప్రాణాలను ఇవ్వడానికైనా సిద్ధమవుతుంది.. పిల్లలకు మంచి జీవితం అందించడానికి పొద్దున లేచిన సమయం నుంచి రాత్రి పడుకునే వరకు పనిచేస్తూనే ఉంటుంది. అందుకే తల్లిని మించిన దైవం మరొకటి ఉండదని కూడా అంటుంటారు.

ఎప్పుడూ పిల్లల తిన్నారా, మంచిగున్నారా, పడుకున్నారా అనేవే తల్లికి ముఖ్యం. అలా ఆలోచించే తల్లి తమ బిడ్డ చదువుల కోసమో లేదా ఉద్యోగం కోసమో విదేశాలకు వెళ్ళినప్పుడు ఎంతగా అల్లాడిపోతుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. ఓ కొడుకు తన తల్లిని సడెన్ గా సర్ప్రైజ్ చెయ్యాలని అనుకున్నాడు.. తల్లి తనను గుర్తుపట్టకుండా కర్చీఫ్ పెట్టుకొని వెళ్లాడు.. ఆ తల్లి చేపలు అమ్ముతుండగా ఆమె వద్దకు వెళ్లి బేరం ఆడాడు. అయితే రెండు నిమిషాల్లోనే ఆ అమ్మ బేరం ఆడేది తన కుమారుడేనని గుర్తించింది. ఆ తర్వాత బాగా ఎమోషనల్ అయ్యి ఆనంద భాష్పాలు కార్చింది… అందుకు సంబందించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది..

ఈ ఘటన కర్ణాటకలో చోటు చేసుకుంది.. గంగోల్లి నివాసి అయిన రోహిత్ ఏళ్ల కిందట ఉద్యోగం కోసం దుబాయ్ వెళ్లాడు. రీసెంట్ గానే ఇంటికి తిరిగి వచ్చాడు. అయితే ఇంటికి వస్తున్నట్లు తల్లికి గానీ, బంధుమిత్రులకు గానీ చెప్పలేదు. నేరుగా ఇంటికి వెళ్లిపోయాడు ఆ సమయంలో ఆమె ఇంట్లో లేదు. దాంతో అతడు కందపుర తాలూకాలోని గంగోల్లి మార్కెట్‌కు వెళ్లాడు. తన అమ్మ ఉండటం గమనించి ముఖానికి కర్చీఫ్ కట్టుకున్నాడు. కళ్ళు కనిపించకుండా గ్లాసెస్ పెట్టుకున్నాడు. ఆపై తల్లితో చేపలు బేరం ఆడటం మొదలుపెట్టాడు… మొదట కనుక్కోలే పోయింది.. ఆ తర్వాత తన కొడుకే అని తెలుసుకొని ఏడ్చేసింది.. ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది..