Viral video : తల్లితో కొడుకు ప్రాంక్.. హార్ట్ టచింగ్ వీడియో వైరల్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తల్లి, బిడ్డల అనుభందం గురించి ఎంత చెప్పినా తక్కువే.. ఆ బంధానికి పేరు, సరి తూగె ప్రేమ మరొకటి లేదు.. ఎక్కడ.. ఎంత మందిలో ఉన్నా కూడా తన కొడుకును తల్లి గుర్తు పడుతుంది.. తన పిల్లల విషయంలో చాలా నిస్వార్ధంగా ఉంటుంది. వారి కోసం ప్రాణాలను ఇవ్వడానికైనా సిద్ధమవుతుంది.. పిల్లలకు మంచి జీవితం అందించడానికి పొద్దున లేచిన సమయం నుంచి రాత్రి పడుకునే వరకు పనిచేస్తూనే ఉంటుంది. అందుకే తల్లిని మించిన దైవం మరొకటి ఉండదని కూడా అంటుంటారు.
ఎప్పుడూ పిల్లల తిన్నారా, మంచిగున్నారా, పడుకున్నారా అనేవే తల్లికి ముఖ్యం. అలా ఆలోచించే తల్లి తమ బిడ్డ చదువుల కోసమో లేదా ఉద్యోగం కోసమో విదేశాలకు వెళ్ళినప్పుడు ఎంతగా అల్లాడిపోతుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. ఓ కొడుకు తన తల్లిని సడెన్ గా సర్ప్రైజ్ చెయ్యాలని అనుకున్నాడు.. తల్లి తనను గుర్తుపట్టకుండా కర్చీఫ్ పెట్టుకొని వెళ్లాడు.. ఆ తల్లి చేపలు అమ్ముతుండగా ఆమె వద్దకు వెళ్లి బేరం ఆడాడు. అయితే రెండు నిమిషాల్లోనే ఆ అమ్మ బేరం ఆడేది తన కుమారుడేనని గుర్తించింది. ఆ తర్వాత బాగా ఎమోషనల్ అయ్యి ఆనంద భాష్పాలు కార్చింది… అందుకు సంబందించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది..
Also Read
- Shocking Love Story: ముసలోడికి దసరా పండగ.. 22 ఏళ్ల యువతితో పెళ్లి చేసిన గ్రామస్తులు..
- Hyderabad: గుడ్డిగా నమ్మితే ప్రాణాలు గాల్లో కలిసినట్టేనా? హైదరాబాద్ మర్డర్ నేర్పిస్తున్న పాఠమిదేనా?
- Telangana : తెలంగాణ ఉద్యమకారులకు గుడ్న్యూస్.. ప్రభుత్వం కీలక నిర్ణయం..!
- CSK Vs LSG: లక్నో గ్రౌండ్లో కార్తీక్ శర్మ వీరవిహారం.. నిర్ణీత 20 ఓవర్లలో చెన్నై భారీ స్కోరు..
ఈ ఘటన కర్ణాటకలో చోటు చేసుకుంది.. గంగోల్లి నివాసి అయిన రోహిత్ ఏళ్ల కిందట ఉద్యోగం కోసం దుబాయ్ వెళ్లాడు. రీసెంట్ గానే ఇంటికి తిరిగి వచ్చాడు. అయితే ఇంటికి వస్తున్నట్లు తల్లికి గానీ, బంధుమిత్రులకు గానీ చెప్పలేదు. నేరుగా ఇంటికి వెళ్లిపోయాడు ఆ సమయంలో ఆమె ఇంట్లో లేదు. దాంతో అతడు కందపుర తాలూకాలోని గంగోల్లి మార్కెట్కు వెళ్లాడు. తన అమ్మ ఉండటం గమనించి ముఖానికి కర్చీఫ్ కట్టుకున్నాడు. కళ్ళు కనిపించకుండా గ్లాసెస్ పెట్టుకున్నాడు. ఆపై తల్లితో చేపలు బేరం ఆడటం మొదలుపెట్టాడు… మొదట కనుక్కోలే పోయింది.. ఆ తర్వాత తన కొడుకే అని తెలుసుకొని ఏడ్చేసింది.. ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది..
Son of a fisherwoman who worked in Dubai returned to his native- Gangolli in #Uudpi, he did not reveal his identity initially, but mother sensed it was his son who played a prank#Mothersentiment @XpressBengaluru @vinndz_TNIE pic.twitter.com/XvS5XIGeKc
— Prakash (@prakash_TNIE) September 22, 2023
తాజావార్తలు
-
Lift Accident : తెగిపడ్డ అపార్ట్మెంట్ లిఫ్ట్.. ఆరుగురు బీఆర్ఎస్ నాయకులకు గాయాలు.!
-
Off The Record : పొలిటికల్ డబుల్ యాక్షన్తో రోజా ఇరుకున పడ్డారా?
-
Shocking Love Story: ముసలోడికి దసరా పండగ.. 22 ఏళ్ల యువతితో పెళ్లి చేసిన గ్రామస్తులు..
-
Story Board : ఫ్యూచర్ కోసం ఆర్థిక సూత్రం..? సంక్షోభం ముంచుకొచ్చాక ప్రభుత్వం మేల్కోందా ?
-
Hyderabad: గుడ్డిగా నమ్మితే ప్రాణాలు గాల్లో కలిసినట్టేనా? హైదరాబాద్ మర్డర్ నేర్పిస్తున్న పాఠమిదేనా?
ట్రెండింగ్
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
-
Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..