NTV Telugu Site icon

Viral Video: సిక్స్ కొట్టి మరీ ఔట్ అయ్యాడు.. ఎలాగో మీరే చూడండి! అయ్యో పాపమని అనకుండా ఉండలేరు

Toby Roland Jones Out

Toby Roland Jones Out

Middlesex Captain Toby Roland-Jones hits a 6 but gets hit wicket: క్రికెట్ ఆటలో బ్యాటర్‌లు చాలా విధాలుగా ఔట్ అవుతుంటారు. బౌల్డ్, క్యాచ్, రనౌట్ ద్వారా బ్యాటర్ పెవిలియన్ చేరుతుంటాడు. కొన్నిసార్లు సొంత తప్పిదంతో ఎవరూ ఊహించని విధంగా కూడా బ్యాటర్ ఔట్ అవుతాడు. అయితే చాలా అరుదుగా మాత్రమే సిక్స్ బాది మరీ పెవిలియన్ చేరుతుంటారు. తాజాగా ఇలాంటి ఘటనే కౌంటీ ఛాంపియన్‌షిప్‌ 2023లో చోటుచేసుకుంది. మిడిల్‌సెక్స్ కెప్టెన్ టోబీ రోలాండ్ జోన్స్ సిక్స్ కొట్టి ఔటయ్యాడు.

కౌంటీ ఛాంపియన్‌షిప్‌ 2023 డివిజన్‌ వన్‌ పోటీల్లో భాగంగా జులై 15న వార్విక్‌షైర్‌, మిడిల్‌సెక్స్ మధ్య మ్యాచ్ మొదలైంది. తొలి ఇన్నింగ్స్‌లో మిడిల్‌సెక్స్ కెప్టెన్ టోబీ రోలాండ్ జోన్స్ హిట్ వికెట్‌గా వెనుదిరిగాడు. రోలాండ్ 14 బంతుల్లో 21 పరుగులు చేసి మంచి ఊపుమీదున్నాడు. ఇక ఎడ్‌ బెర్నార్డ్‌ బౌలింగ్‌లో తాను ఎదుర్కొన్న 15వ బంతిని సిక్సర్‌గా మలిచాడు. బంతి వెళ్లి స్టేడియం బయట పడగా.. అంపైర్ కూడా సిక్స్ అని సిగ్నల్ ఇచ్చేశాడు. అయితే షాట్ ఆడిన అనంతరం రోలాండ్ నియంత్రణ కోల్పోవడంతో.. బ్యాట్ వికెట్లను తాకింది. వెంటనే బెయిల్స్ కిందపడిపోయాయి.

Also Read: Tomato Price: రికార్డు స్థాయికి టమాటా ధర.. బెంబేలెత్తిపోతున్న కొనుగులుదారులు!

టోబీ రోలాండ్ జోన్స్ బ్యాట్ వికెట్లను తాకడం గమనించిన కీపర్.. ఔట్ అంటూ అప్పీల్ చేశాడు. రిప్లేలో బ్యాట్ వికెట్లను తాకిందని తేలడంతో రోలాండ్ హిట్ వికెట్‌గా ఔట్ అయ్యాడు. దాంతో వార్విక్‌షైర్‌ జట్టు ప్లేయర్స్ సంబరాలు చేసుకున్నారు. మరోవైపు రోలాండ్ మాత్రం నిరాశగా పెవిలియన్ చేరాడు. ఇందుకుసంబందించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు నవ్వుకుంటారు. ‘టోబీ రోలాండ్ అంత దురదృష్టవంతుడు మరొకరు ఉండరు’, ‘అయ్యో పాపం రోలాండ్’, ‘సిక్స్ చేజారే.. ఔట్ అయ్యే’ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Also Read: Yuvraj Singh: యువరాజ్ సింగ్ కుటుంబానికి తప్పుడు బెదిరింపులు.. మహిళ అరెస్ట్!