NTV Telugu Site icon

Viral Video : వార్నీ.. ఇదేం ఆచారంరా నాయనా.. మంటల్లో దూకిన భక్తులు.. వీడియో వైరల్..

Keralaa (2)

Keralaa (2)

ఒక్కో ఏరియాలో ఒక్కో ఆచారం ఉంటుంది.. ఇక పండగల సందర్బంగా కొన్ని ప్రాంతాల్లో వింత ఆచారాలు ఉంటాయి.. ఇక మరికొన్ని రోజుల్లో హోళి పండుగ రాబోతుంది.. ఈ క్రమంలో మన దేశంలో ఓ రాష్ట్రంలో వింత ఆచారం ఒకటి బయటకు వచ్చింది.. అదేంటంటే మంటల్లో దూకడం.. ఇదేం వింత ఆచారం అనుకుంటున్నారా.. మీరు విన్నది అక్షరాల నిజం.. నెట్టింట ఓ వీడియో తెగ వైరల్ అవుతుంది..

ఒక్కోసారి కొందరు నిప్పుల గుండంలో నడుస్తుంటారు. మరి కొన్ని సార్లు మండే కర్పూరాన్ని మింగేస్తారు. ఇలాంటి భయానక భక్తికి సంబంధించిన వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కాగా, ఇప్పుడు వైరల్‌ అవుతున్న వీడియోలో కొందరు భక్తులు మంటల్లోకి దూకారు. ఈ వీడియో చూసిన తర్వాత ఎవరికైనా భయం పుట్టడం కామన్.. ఈ ఆచారం ఎలాగో చూస్తే వణికిపోతారు.. ఈ మంటల్లో దూకే ఆచారం కేరళలో జరుగుతుంది..

కొద్ది రోజుల్లో హోళి పండుగ మరికొద్ది రోజుల్లో రాబోతుంది.. ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ సహా ఇతర రాష్ట్రాల్లో కూడా హోలీని జరుపుకుంటారు. ఈ నేపథ్యంలో కేరళలో హోలీ పండగ సందడి మొదలైంది. మంటల్లోంచి జనం ఎలా దూకుతున్నారో వీడియోలో చూడొచ్చు.. ఒకవైపు నుంచి మరోవైపు నడుచుకుంటూ వెళ్తారు.. అలా వెళ్లిన వారికి ఎక్కడ కాలదు.. అమ్మ అనుగ్రహం లభిస్తుందని వారి నమ్మకం.. ఇక ఆలస్యం ఎందుకు ఆ వీడియోను మీరు ఒక్కసారి చూసేయ్యండి..