పంజాబ్ లో వరదలు బీభత్సం సృష్టిస్తుంది. నయాగావ్, పరిసర ప్రాంతాల్లోని జయంతి మజ్రీలోని ఐదు గ్రామాలు భారీ వర్షాలతో నీట మునిగాయి. మజ్రీ వైపు ప్రవహించే కాలానుగుణ నది ఆదివారం ఉప్పొంగి ప్రవహించింది. ఇద్దరు యువకులు వారి జీప్ తో సహీ నది దాటేందుకు ప్రయత్నించగా వారిని స్థానికులు అడ్డుకున్నారు. అయినా వారి మాట లెక్క చేయకుండా జీప్ ను ముందుకు పోనిచ్చారు. దీంతో వారు జీపుతో సహా కొట్టుకుని పోయారు. గ్రామస్తులు జేసీబీ సహాయంతో జీపును బయటకు తీశారు. వాహనం పూర్తిగా దెబ్బతింది.
Also Read: Team India: ఛెతేశ్వర్ పుజారా తర్వాత ఎవరు?.. రిటైర్మెంట్ లిస్టులో ‘ఆ నలుగురు’!
దాదాపు 22 రోజులు అయిందని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ఇక్కడి రోడ్లపై ఉన్న ర్యాంప్ వంతెనలు విరిగిపోయాయి. పరిపాలన, ప్రభుత్వం కళ్ళు మూసుకున్నాయి. 22 రోజులుగా గ్రామస్తులు ఈ సమస్యపై ప్రభుత్వానికి విన్నవించారు.అయినప్పటిక .. ప్రభుత్వంలో ఎలాంటి మార్పులేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గత సంవత్సరం కూడా వర్షాకాలంలో వరద నీటిలో మూడు మోటార్ సైకిళ్ళు కొట్టుకుపోయాయి. ఆగస్టు 24న జీపు కొట్టుకుపోయిందని, అదృష్టవశాత్తూ పెద్ద ప్రమాదం జరగలేదని, కానీ వాహనం పూర్తిగా దెబ్బతిందని కసౌలి గ్రామ మాజీ సర్పంచ్ సోమనాథ్ చెప్పారు.
