Site icon NTV Telugu

Viral Video: దూల తీరిందిగా.. ఇప్పుడు ఆ పెళ్లికూతురు పరిస్థితి ఎలా ఉందో మరి..

Bride Viral Video

Bride Viral Video

పెళ్లి వేడుకల్లో ఈమధ్యకాలంలో వింత సంఘటనలు జరగడం సర్వసాధారణం అపోయాయి. సోషల్ మీడియాలో లైక్‌లు, వ్యూస్‌ కోసం కొందరు ప్రయత్నించడం చూస్తున్నాం. ఒక్కోసారి పెళ్లిమండపంలో వధూవరులు చేసే అల్లరి సమయంలో జరిగే సంఘటనలు అందరినీ నవ్విస్తాయి. ఇలాంటి ఫన్నీ వీడియోలను మనం నిత్యం చూస్తూనే ఉంటాం. తాజాగా ఇలాంటి ఘటనకు సంబంధించిన వీడియో ఆన్‌లైన్‌లో ప్రత్యక్షమైంది. వధూవరులు దండలు మార్చుకుంటున్నప్పుడు, ఆమె చుట్టూ ఉన్నవారు చేసిన నిర్వాకం ముగింపులో వధువుకు ఏమి జరుగుతుందో చూడండి.

Also Read: SRH vs CSK: టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న సన్ రైజర్స్..

దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌ గా మారింది. వివాహ వేడుకలో, వధూవరులు వేదికపై దండలు మార్చుకుంటున్నారు. వధువు దండ వేసింది. ఇక దండ వేయడం వరుడి వంతు. వరుడు దండను తీసుకుని వధువు మెడలో వేస్తుండగా., పక్కనే ఉన్న బంధువులు వధువును పైకి లేపారు. దీంతో వరుడికి దండ వేయడం కష్టంగా మారింది. అయినా ఎలాగైనా దండ వేయాలని ప్రయత్నిస్తున్నాడు. ఈ సందర్భంలో, వధువు వరుడికి చేరుకోలేని ఎత్తులోకి వెళ్తుంది.

Also Read: India W vs Bangladesh W: మొదటి టీ20లో బంగ్లాదేశ్‭ను చిత్తుచేసిన టీమిండియా..

వధువు బంధువులు చేసిన పనికి వరుడు షాక్ అయ్యాడు. పక్కనే ఉన్న సోఫా మీదకు ఎక్కి అక్కడి నుంచి పెళ్లికూతురు మెడలో దండ వేశాడు. దీనివల్ల వధువును ఎత్తుకున్నవారు అదుపు తప్పి పడిపోయారు. వీరితో పాటు వధువు కూడా ధబేళమని కిందకు పడిపోయింది. ఈ ఘటనను అక్కడి ప్రజలు చిత్రీకరించి సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ వీడియో ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా హల్చల్ చేస్తోంది. సోషల్ మీడియా వినియోగదారులు దీనిపై వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ఇందులో కొందరైతే.. కామెడీ చేయాలి కానీ ఎక్కువ చేస్తే ఇలాగే ఉంటుంది మరి అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Exit mobile version