Site icon NTV Telugu

Dog attaked Elephant : కుక్క పిల్లకి భయపడి బొక్క బోర్లా పడ్డ ఏనుగు.. వైరలవుతున్న వీడియో..

Untitled Design (18)

Untitled Design (18)

సాధారణంగా ఏనుగులు చూసేందుకు చాలా పెద్దగా ఉంటాయి. దాని ఆకారాన్ని చూసి చిన్న చిన్నజంతువులు, క్రూర మృగాలు దాని దగ్గరకి వచ్చేందుకు జంకుతుంటాయి. అలాంటి భారీ కాయమున్న ఏనుగు ఓ చిన్న కుక్క పిల్లకు భయపడి బొక్క బోర్ల పడింది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.

Read Also: Wife give poison to husband: ఉదయమంతా భర్త కోసం ఉపవాసం.. సాయంత్రం కాగానే..

వీడియో కనిపించిన కుక్క, దాని పిల్ల ఓ ఇంటికి కాపాలాగా ఉన్నాయి. ఒక ఏనుగు ఒక ఇంటి ముందుగా వెళుతుండగా.. ఒక కుక్క దానిని చాలా భయపెట్టింది. వెంటనే అది ఆవేశంతో దాని మీదకు వెళ్లబోయింది. పక్కనే అరుగుపై పడుకున్న కుక్క పిల్ల ఆ ఏనుగును ఒక్కసారిగా భయపెట్టింది. దీంతో అది రెండు అడుగులు వెనక్కి వేసి బోర్లా పడిపోయింది. ఈ వీడియో కొందరు నెటిజన్లు నవ్వుకుంటున్నారు. కానీ ఇదంతా కావాలనే క్రియేట్ చేశారని.. లేకపోతే…ఏనుగు కుక్కపిల్లకు భయపడి బోర్లా పడిపోవడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. డియోలలోని కుక్కలు ధైర్యంగా అనిపించినప్పటికీ, ఏనుగు ప్రతిచర్య సాధారణంగా నిజమైన భయం కంటే ఆశ్చర్యంగా లేదా చిరాకుగా ఉంటుంది. ఈ సంఘటనలు ఏనుగు భయం కంటే ఆశ్చర్యకరంగా పెద్ద చొరబాటుదారుడి పట్ల కుక్క యొక్క ప్రాదేశిక ప్రవృత్తిని ప్రదర్శిస్తాయి.

Read Also:Sai Sudharsan Catch: సాయి సుదర్శన్‌ సూపర్ క్యాచ్.. దెబ్బ గట్టిగా తాకినా వదలలేదు!

ఈ హాస్యాస్పదమైన వీడియోను సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ట్విట్టర్‌లో షేర్ చేశారు. “కుక్కను చూసి భయపడి ఏనుగు పడిపోయింది! ఇది AI- జనరేటెడ్ వీడియోనా లేదా నిజ జీవిత సంఘటననా?” అనే క్యాప్షన్‌తో కామెంట్లు పెడుతున్నారు. ఈ 10 సెకన్ల వీడియోను ఇప్పటికే 1 మిలియన్ కంటే ఎక్కువ మంది వీక్షించారు.

Exit mobile version