Site icon NTV Telugu

Viral Video: వామ్మో గద్ద.. చూస్తుండగానే ఎంత పని చేసింది!

Deer And Eagle Viral Video

Deer And Eagle Viral Video

Deer and Eagle Viral Video: జింకను గద్దను ఎత్తుకెళ్లడం ఎప్పుడైనా చూశారా?. మీరు చూస్తే.. గీస్తే.. కోడి పిల్లలు, పక్షులను, పాములను గద్ద ఎత్తుకెళ్తుండడం చూసుంటారు. అధిక బరువున్న వాటిని పట్టుకుని గద్దలు ఎగరలేవని అనుకుంటాం. కానీ గద్ద చాలా శక్తివంతమైందని సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియో చూస్తే మీకే అర్థమవుతుంది. గద్ద కళ్లు, కాళ్లు, నోరు చాలా శక్తి వంతంగా ఉంటాయి. ‘క్రేజీ మూమెంట్స్’ అనే ఎక్స్ యూజర్ సోషల్ మీడియాలో ఓ వీడియోను పోస్ట్ చేశారు. ఈ వీడియోను దాదాపు 26 లక్షల మంది వీక్షించారు. దాదాపు నాలుగు వేల మంది ఆ వీడియోను లైక్ చేసి కామెంట్ చేశారు.

Also Read: Pakistan Team: పాకిస్తాన్ జట్టు ప్రకటన.. ఏడుగురు ప్లేయర్స్‌కు ఇదే మొదటిసారి! కప్ గెలుస్తారా భయ్యా

గద్ద ఆహారం కోసం వెతుకుతుండగా.. దానికి ఓ జింక పిల్ల కనపడింది. దీంతో ఆ జింక పిల్ల దగ్గరకు వచ్చి దానిని తన కాళ్ల గోళ్లతో పట్టుకుని గాల్లోకి ఎగిరిపోయింది. ఆ జింక పిల్ల ఆ గద్ద నుంచి తప్పించుకోలేక చనిపోయింది. గద్ద ఏదైనా జంతువును పట్టుకున్న తర్వాత మొదటగా దాని కళ్లు పీకేస్తుంది. దాంతో ఆ జంతువు తనకున్న శక్తిని కొల్పోవడంతో పాటు అక్కడికిక్కడే ప్రాణాలు వదులుతుంది. ఒక వేళ చనిపోకపోతే తన పోడవాడి ముక్కుతో ఆ జంతువును పొడిచి.. పొడిచి చంపి తినేస్తుంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Exit mobile version