Site icon NTV Telugu

Attack: పాములకు కోపం తెప్పిస్తే.. ఎట్టాగుంటదో తెలుసా.. ఇట్టాగే ఉంటది…

Untitled Design

Untitled Design

సాధారణంగా పాములను చూస్తే ఎవరికైనా.. గుండెలు జారీపోతాయి. కొందరు ధైర్యం చేసి పాములను పట్టుకునేందుకు ప్రయత్నిస్తారు. పాములు ఎవరిపైనా అనవసరంగా దాడి చేయవు. అవి తమకు తాము రక్షించుకోవడానికి, భయాందోళనలకు గురైతేనే దాడి చేస్తాయి. అందుకే పాములను అనవసరంగా ఇబ్బంది పెట్టకూడదని, లేకుంటే అవి ప్రమాదకరంగా మారుతుంటాయి. పాముకు కోపం వస్తే ఎలా ఉంటుందో చెప్పేందేకు చేసిన ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.

ఒక పాము బెలూన్‌ను తన శత్రువుగా పొరపాటున భావించి, అది తీసుకునే నిర్ణయం అందర్నీ ఖచ్చితంగా షాక్‌కు గురి చేస్తుంది. ఈ వీడియో ఇంటర్నెట్‌లో సంచలనం సృష్టించింది. పాము తన పడగ విప్పి, బుసలు కొడుతూ నేలపై కూర్చొంది. ఇంతలో, ఒక వ్యక్తి పాము ముందుకు ఒక బెలూన్ ను తీసుకువచ్చాడు. పాము మరింత కోపంగా రెచ్చిపోయింది. అది కొన్ని క్షణాలు బెలూన్ వైపు చూస్తూ ఉండి, ఆపై, ఒక దెబ్బతో, తన పడగతో తన శక్తినంత ఉపయోగించి, దానిని కొడుతుంది. అది బెలూన్ ని చాలాసార్లు కొట్టినప్పటికీ, అది పగిలిపోలేదు. అయితే, దాని పక్కన నిశ్శబ్దంగా కూర్చున్న మరొక పాము ఒకేసారి బెలూన్ ను పగులగొట్టింది. బెలూన్ పగిలిన వెంటనే, మొదటి పాము భయపడిపోయింది.

దీన్ని బట్టి ఒక పాము బెలూన్‌ను శత్రువుగా ఫీలయితే.. ఎంత వేగంగా దాడి చేస్తుందో.. ఈ వీడియో చూస్తే అర్థమవుతుంది. కాబట్టి ఎవరూ పాములతో పరాచకాలు ఆడకండి.. ఈ 15 సెకన్ల వీడియోను 55,000 సార్లు వీక్షించారు వందలాది మంది వివిధ మార్గాల్లో లైక్‌లు, కామెంట్లు చేశారు.

Exit mobile version