Site icon NTV Telugu

Viral News: ఈ జంట జిమ్ కు వెళ్లి చేసే పనులు వింటే షాక్ అవుతారు.. 18 సార్లు ఆ పని చేసి..

Gym Thiefs

Gym Thiefs

మాములుగా లవర్స్ ఎలా ఉంటారు.. ఇంట్లో ఎవరికి తెలియకుండా ప్రపంచాన్ని చుట్టేస్తారు.. ఊహల్లో తేలిపోతారు.. రొమాన్స్ చేస్తూ ఎంజాయ్ చేస్తారు.. మొన్నీమధ్య లవర్స్ చైన్ స్నాచింగ్ కు పాల్పడుతున్న ఘటన తెగ వైరల్ అయ్యింది.. ఇప్పుడు అదే తరహాలో మరో జంట రెచ్చిపోయింది.. జిమ్ కు వెళ్తూనే మొత్తం ఖాళీ చేస్తుండేవారు… జల్సాలు, విలాసవంతమైన జీవితం కోసం దొంగతనాల బాట పట్టారు. అంతేకాదు.. తనకు అన్నం పెట్టిన సంస్థలోనే కన్నింగ్ ప్లాన్‌ వేసి నేరాలకు పాల్పడ్డారు. యూకేలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.. ఒకసారి వివరంగా తెలుసుకుందాం..

ఆశ్లే సింగ్ , సోఫీ బ్రూయిన్ లు ఓ జిమ్ లో ట్రైనర్స్ గా చేరారు.. అందరితో బాగానే ఉంటూ ట్రైనింగ్ ఇస్తూనే అందిన కాడికి దోచుకున్నారు.. అక్కడే వీరిద్దరు ప్రేమలో పడ్డారు. అయితే వారికి వచ్చే శాలరీస్ ఇద్దరి విలాసాలకు ఏమాత్రం సరిపోకపోయేవి. దీంతో బాగా ఆలోచించిన ప్రేమికులు తాము పని చేస్తున్న జిమ్‌కు వచ్చే వారిపై దృష్టి సారించారు. ఈక్రమంలో జిమ్‌కు వచ్చే వాళ్లంతా వాళ్ల వ్యాలెట్స్, క్రెడిట్, డెబిట్ కార్డులను జిమ్ లాకర్లలో పెట్టడం గమనించారు. ఇక పక్కా ప్లాన్‌తో వాటిని కొట్టేయడం కార్డుల్లో డబ్బులను కొట్టేయ్యడం చేసేవారు..

అలా కొన్ని లక్షలను కొట్టేశారు.. కష్టపడి కొట్టేసిన డబ్బుతో ఏకంగా పారిస్, దుబాయ్, అమ్లిఫీ కోస్ట్ దేశాల్లో విహరించిందీ ప్రేమజంట. విలాసవంతమైన హోటల్స్‌లో స్టే చేస్తూ విమానాల్లో చక్కర్లు కొట్టింది. అయితే జిమ్‌లో జరుగుతున్న చోరీలపై ఫిర్యాదు అందుకున్న పోలీసులు ప్రత్యేకమైన నిఘాను ఏర్పాటు చేశారు.. సీక్రెట్‌గా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి అక్కడి వారిపై ఓ కన్నేశారు. ఇంకేముంది.. అడ్డంగా బుక్కైన ఈ దొంగ ప్రేమికులను విదేశాలకు వెళ్లి వస్తుండగా గాట్విక్ ఎయిర్ పోర్ట్‌లో అరెస్ట్ చేశారు..ఇప్పుడు ఇద్దరు కూడా జైల్లో ఊసలు లెక్క పెడుతున్నారు..

Exit mobile version